ప్రొద్దుటూరు: టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే  రాచమల్లు శివప్రసాద్ రెడ్డి  శుక్రవారం నాడు చౌడేశ్వరీ ఆలయంలో ప్రమాణం చేశారు.

గత ఏడాది డిసెంబర్ 29వ తేదీన ప్రొద్దుటూరులో సుబ్బయ్య దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసుకు సంబంధించి రవితో పాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు.ఈ హత్యలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆయన బావమరిదికి ప్రమేయం ఉందని టీడీపీ ఆరోపించింది.

also read:పాతకక్షలతోనే నందం సుబ్బయ్య హత్య: ఎస్పీ అన్బు రాజన్

వీరిద్దరి పేర్లను కూడ ఎఫ్ ఐ ఆర్ లో చేర్చాలని గురువారం నాడు టీడీపీ  జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహా టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వీరిద్దరిన పేర్లను కూడ ఎఫ్ఐఆర్ లో చేర్చారు.

సుబ్బయ్య అంత్యక్రియలు  గురువారం నాడు మధ్యాహ్నం ప్రొద్దుటూరులో జరిగాయి. ఈ అంత్యక్రియల్లో లోకేష్ పాల్గొన్నారు.నందం సుబ్బయ్య హత్య కేసులో తన ప్రమేయం లేదని చౌడేశ్వరీ ఆలయంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రమాణం చేశారు.