మైదుకూరు: కడప డిల్లా మైదుకూరు మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక విషయంలో ఉత్కంఠ వీడడం లేదు. చైర్ పర్సన్ పదవి కోసం వైసీపీ, టిడీపీ ఎత్తులు పైయెత్తులు వేస్తున్నాయి. టీడీపీ కౌన్సిలర్ మహబూబ్ ఓటు కీలకం కావడంతో ఈ ఉత్కంఠ చోటు చేసుకంది.

టీడీపీ కౌన్సిలర్ కనిపించకుండా పోయారు. తమ కౌన్సిలర్ ను వైసీపీ అపహరించుకుపోయిందని టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు. మహబూబ్ సమావేశానికి గైర్హాజరైతే చైర్ పర్సన్ పీఠం వైసీపికి దక్కే అవకాశం ఉంది. 

మైదుకూరు మున్సిపాలిటీలో 24 వార్డులు ఉండగా, టీడీపీ 12 వార్జులను గెలుచుకుంది. వైసీపీకి 11 వార్డులు దక్కాయి. ఆరో వార్డును జనసేన గెలుచుకుంది. వైసీపీకి ఇద్దరు ఎక్స్ అఫిషియో సభ్యులున్నారు. వారిని కలిపితే వైసీపీకి 13 ఓట్లు ఉంటాయి. మహబూబ్ సమావేశానికి హాజరు కాకపోతే టీడీపీకి ఓటమి తప్పదు. ఈ స్థితిలో మహబూబ్ అజ్ఞాతంలోకి వెళ్లడంతో టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. 

అయితే, వైసీపీ కౌన్సిలర్ తో టీడీపీకి ఓటు వేయిస్తానని మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. వైసీపీ కౌన్సిలర్లకు గాలం వేయడానికి టీడీపీ ప్రయత్నించింది. అయితే, ఆరో వార్డు కౌన్సిలర్ అజ్ఞాతంలోకి వెళ్లడంతో టీడీపీకి మొదటికే మోసం వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి.