బ్రాహ్మణి, మా అమ్మ 25 ఏళ్ల చెమట కష్టం హెరిటేజ్: జగన్ కు లోకేష్ రిప్లై

My mother and Brahmani put in their sweat: Nara Lokesh
Highlights

హెరిటేజ్ సంస్థపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తిప్పికొట్టారు. 

హైదరాబాద్: హెరిటేజ్ సంస్థపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తిప్పికొట్టారు. ట్విటర్ వేదికగా ఆయన జగన్ కు సమాధానం ఇచ్చారు. 

హెరిటేజ్ అభివృద్ధిలో మా అమ్మ (భువనేశ్వరి), బ్రాహ్మణి 25 ఏళ్ల చెమట కష్టం ఉందని ఆయన అన్నారు. "మాపై మీ తండ్రి 20 ప్లస్ కేసులు పెట్టారు, రుజువు చేయడంలో విఫలమయ్యారు. ఎందుకుంటే మేం నీతిగా వ్యాపారం చేశాం" అని లోకేష్ అన్నారు. దాని నుంచి నువ్వు నేర్చుకోవు అని అడిగారు.  

డియర్ అపోజిషన్ లీడర్ అని సంబోధిస్తూ నారా, వైఎస్ ఇంటి పేర్లలోనే తేడా ఉందని, తాము రాష్ట్రాభివృద్దికి పాటుపడగా, మీరు అవినీతికి పాల్పడ్డారని అన్నారు. 

తమ కుటుంబం మాత్రమే ఆస్తుల వివరాలు ప్రకటిస్తున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. తమను అనుసరించే దమ్ము ఉందా అని ఆయన జగన్ ను ప్రశ్నించారు. 

loader