(వీడియో) ప్రొద్దుటూరులో దారుణ హత్య

murder in proddutur in broad daylight
Highlights

కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో  కొద్ది సేపటి కిందట దారుణ హత్య జరిగింది.

కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో  కొద్ది సేపటి కిందట దారుణ హత్య జరిగింది.  పూర్తి వివరాలు అందాల్సివుంది. కొంత మంది వ్యక్తులు ప్రసాదరెడ్డి  అనే వ్యక్తి ని కత్తులతో పొడిచి, గొడ్డళ్లతో దాడిచేసి చంపేసి పరారయిపోయారు. ఇది అంతా చూస్తుండగానే జరిగింది.ఈ హత్య  టిబి రోడ్, మునిరెడ్డి ఆసుపత్రి ఎదురుగా జరిగింది. ఇది రాజకీయ హత్య లేక మరొక ఇతర కారణాల వల్ల జరిగిన దాడియా, తెలియడం లేదు. దాడికి గురయిన వ్యక్తి అక్కడిక్కడే చనిపోయాడు.

 

 

మృతుడు జమ్మలమడుగు మండలం దేవగుడి వాసి అని తెలిసింది. స్థానికుల సమాచారం  మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

హత్య కోర్టుకు సమీపంలో జరగడంతో జనాల్లో పలుఅనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోర్టులో సాక్ష్యం చెప్పేందుకు వస్తున్న వ్యక్తిని ప్రత్యర్థులు చంపివుంటారనే అనుమానం కలుగుతోందంటూ స్థానికులు చెబుతున్నారు. కుటుంబ తగదాల వల్లే ఈ హత్య జరిగివుండొచ్చని భావిస్తున్నారు. అయితే ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.!

 

ఒకప్పుడు  ఫ్యాక్సన్ హత్యలకు పేరు మోసినా ఈ పట్టణం  ఈ మధ్య ప్రశాంతంగా  ఉంది. అయిదేండ్ల కిందట జమ్మలమడుగురో డ్డులో ఇంటి ముందు నిలబడుకుని ఉన్న సంతోష్ రెడ్డి అనే విద్యార్థిని ఎత్తుకు పోయి ఎర్రగుంట్ల రోడ్డులో ఎవరో హత్య చేశారు.

 

తర్వాత రాజకీయాలే తప్ప హత్యలు లేవనే చెప్పాలి.

 

ఇపుడు ఈరోజు హత్య పట్టణంలో సంచలనం సృష్టించింది.

 

loader