నెల్లూరు జిల్లా మూలపేటలో శుక్రవారం ఉదయం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేత సుధాకర్ పై హత్యాయత్నం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు సుధాకర్ పై దాడి చేశారు. అనంతరం కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు. కాగా... వైసీపీ కార్యకర్తలే దాడి చేశారంటూ.. సుధాకర్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

ఈ ఘాతుకానికి పాల్పడింది.. వైసీపీ నేతలేనంటూ  సుధాకర్ వర్గీయులు ఆందోళన కూడా చేపట్టారు.  ఇదిలా ఉండగా.. తీవ్రగాయాలపాలైన సుధాకర్ ని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పొట్టలో ఎక్కువ కత్తిగాట్లు అయ్యాయని వారు చెబుతున్నారు. ఇది వైసీపీ కార్యకర్తల పనే అని టీడీపీ నేతలు ఆరోపిస్తుండగా.. తమకు ఎలాంటి సంబంధం లేదని వారు చెబుతున్నారు. రాజకీయ కక్షల నేపథ్యంలోనే ఈ గొడవలు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.