ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో అధికార వైసీపీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టిన పురపాలక పన్నుల సవరణ చట్టం బిల్లు వీగిపోయింది
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో అధికార వైసీపీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టిన పురపాలక పన్నుల సవరణ చట్టం బిల్లు వీగిపోయింది.
బిల్లును టీడీపీ, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు వ్యతిరేకించారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా 29 ఓట్లు, అనుకూలంగా 11 మంది ఎమ్మెల్సీలు ఓట్లు వేశారు. ఇద్దరు సభ్యులు తటస్థంగా ఉన్నారు.
బిల్లుపై చర్చ సందర్భంగా కరోనా బారిన పడితే ప్రజాప్రతినిధులకే హాస్పిటల్స్‌లో బెడ్స్ దొరకడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి.
తన కుటుంబానికి ఎదురైన అనుభవాన్ని ఏపీ శాసనమండలిలో ఆయన ప్రస్తావించారు. ఎమ్మెల్సీనైన తనకే ఈ పరిస్థితి ఎదురైదే సామాన్యుల పరిస్థితేంటని వాకాటి ప్రశ్నించారు.
