Asianet News TeluguAsianet News Telugu

గుంటూరులో విషాదం... కరోనాతో మరో ఉపాధ్యాయుడు మృతి

గుంటూరు పట్టణంలోని జలగం రామారావు అనే మున్సిపల్ స్కూల్ ఉపాధ్యాయుడు గతకొంత కాలంతో కరోనాతో బాధపడుతూ తాజాగా మరణించాడు.  

municipal school teacher death with corona in guntur akp
Author
Guntur, First Published Apr 12, 2021, 2:58 PM IST

గుంటూరు: రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ మృత్యుఘంటికలు మోగిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ బారినపడి పలువురు ప్రాణాలు కోల్పోగా తాజాగా మరో ఉపాధ్యాయుడు మృతి చెందాడు. గుంటూరు పట్టణంలోని జలగం రామారావు అనే మున్సిపల్ స్కూల్ ఉపాధ్యాయుడు గతకొంత కాలంతో కరోనాతో బాధపడుతున్నాడు. 

ఈ స్కూల్ కు చెందిన 10 మంది విద్యార్థులు, టీచర్లకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ కావడంతో ఈనెల 9వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు అధికారులు. ఈ క్రమంలోనే తాజాగా కరోనా సోకిన ఉపాధ్యాయుడి ఆరోగ్య పరిస్థితి క్షీణించి మృతిచెందడంతో మిగతావారు ఆందోళనకు లోనవుతున్నారు. 

ఇటీవలే కాసు సాయమ్మ అనే మున్సిపల్ స్కూల్ టీచర్ కరోనా తో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇలా స్కూళ్లు కరోనా వ్యాప్తికి కారణమవుతుండటం ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రుల్లో ఆందోళనను మరింత పెంచింది.

ఇదిలావుంటే ఏపీలో నిన్నటి(ఆదివారం)వరకు 3,495 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 9 లక్షల 25వేల 401 కి చేరుకొన్నాయి.  24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో తొమ్మిది మంది మరణించారు. కరోనాతో చిత్తూరులో నలుగురు, గుంటూరు, కర్నూల్, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కరి చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,300 కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,54,29,391 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 24 గంటల్లో 31,719 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో3,495 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 24 గంటల్లో 1,198 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 97 వేల 147 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 20,954 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.

 24 గంటల్లో అనంతపురంలో 209, చిత్తూరులో 719,తూర్పుగోదావరిలో 041,గుంటూరులో 501, కడపలో 192,కృష్ణాలో 306, కర్నూల్ లో 191, నెల్లూరులో 190,ప్రకాశంలో 215, శ్రీకాకుళంలో 293, విశాఖపట్టణంలో 405, విజయనగరంలో 193,పశ్చిమగోదావరిలో 040కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు:

అనంతపురం -69,540 మరణాలు 609
చిత్తూరు  -94,160,మరణాలు 887
తూర్పుగోదావరి -1,25,817, మరణాలు 637
గుంటూరు  -82,043, మరణాలు 686
కడప  -56,866, మరణాలు 464
కృష్ణా  -52,817,మరణాలు 691
కర్నూల్  -63,063, మరణాలు 500
నెల్లూరు -65,013,మరణాలు 521
ప్రకాశం -63,735, మరణాలు 589
శ్రీకాకుళం -48,039,మరణాలు 350
విశాఖపట్టణం  -64,708,మరణాలు 586
విజయనగరం  -41,970, మరణాలు 238
పశ్చిమగోదావరి -94,735, మరణాలు 542
 

 


 

Follow Us:
Download App:
  • android
  • ios