నారాయణకు అవమానం

First Published 2, Apr 2018, 2:45 PM IST
Municipal authorities insulted minister narayana
Highlights
మంగళగిరి పట్టణంలో చాలా చోట్ల ఇటువంటి బోర్డులనే ఏర్పాటు చేశారు.

చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడు, మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణను మున్సిపల్ అధికారులే ఘోరంగా అవమానించారు. మంత్రిపేరును మంగళగిరి మునిసిపల్ కమిషనర్ గా ప్రచార బోర్డు పై ముద్రించిన ఘనత మంగళగిరి పురపాలక సంఘానికే దక్కుతుంది.

 

మంగళగిరి పట్టణంలో చాలా చోట్ల ఇటువంటి బోర్డులనే ఏర్పాటు చేశారు. గత రెండు రోజులుగా ఇదే పనిలో వున్నారు పురపాలక శాఖ అధికారులు.

 

వేసవి కాలంలో మంగళగిరి పట్టణ ప్రజలకు దాహార్ధిని తీర్చేందుకు మంగళగిరి పురపాలక సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయి. పురపాలక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్న కార్యక్రమంలో సంబంధిత శాఖ మంత్రినే కమీషనర్ గా అడ్వర్టైజ్ మెంట్ బోర్డులపై మంగళగిరి మునిసిపాలిటీ ముద్రించటమే విచిత్రంగా ఉంది.

పట్టణంలోని పలు చోట్ల బోర్డులు నాటినా అధికారులు మాత్రం తాము చేసిన పొరపాటున గుర్తించలేదు. చలివేంద్రలు కొన్ని చోట్ల ప్రారంభమవుతుండగా మరికొన్ని చోట్ల ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి.

loader