ఆంధ్ర ప్రదేశ్ లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముమ్మిడివరం ఒకటి. దళిత కుటంబంలో పుట్టి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి ఏకంగా లోక్ సభ స్పీకర్ పదవిని అధిరోహించిప  జిఎంసి బాలయోగిది ఈ ముమ్మిడివరం  నియోజకవర్గమే. ఇక్కడినుండి ఆయన ఎమ్మెల్యేగా కూడా ప్రాతినిధ్య వహించారు. ఇలా గొప్ప రాజకీయ చరిత్ర కలిగిన ముమ్మిడివరంలో  ప్రస్తుతం ఆసక్తికర రాజకీయాలు సాగుతున్నాయి. ఇక్కడ తెలుగుదేశం, వైసిపి మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పొలిటికల్ వార్ సాగుతోంది. 

ముమ్మిడివరం రాజకీయాలు : 

ముమ్మిడివరం అసెంబ్లీలో అటు అదికార వైసిపి, ఇటు ప్రతిపక్ష టిడిపి రెండూ బలంగానే వున్నాయి. అయితే వైసిపి ఒంటరిగా పోటీచేస్తుంటే టిడిపి మాత్రం ఇతర పార్టీలతో కూటమిగా ఏర్పడి పోటీచేస్తోంది. ఇలా జనసేనతో పొత్తు టిడిపికి కలిసివచ్చే అవకాశాలున్నాయి. ఈ సీటును జనసేన ఆశించినప్పటికి చివరకు టిడిపియే పోటీలో నిలిచింది.

ఇక ముమ్మిడివరం సిట్టింగ్ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కొనసాగుతున్నారు. ప్రస్తుతం వైసిపిలో కొనసాగుతున్న గతంలో కాంగ్రెస్ నుండి కూడా ఎమ్మెల్యేగా గెలిచారు పొన్నాడ. ఇలా ముమ్మిడివరంలో బలమైన క్యాడర్ కలిగిన ఆయన మరోసారి వైసిపి నుండి బరిలో నిలిచారు. 

ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని మండలాలు : 

1. ఐ పోలవరం 
2. తాళ్లరేవు
3. ముమ్మిడివరం 
4. కాట్రేనికోన

ముమ్మిడివరం అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) ‌- 2,29,600

పురుషులు - 1,15,154
మహిళలు ‌- 1,14,443

ముమ్మిడివరం అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

సిట్టింగ్ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ నే మళ్లీ ముమ్మిడివరం బరిలో నిలుపుతోంది వైసిపి. ఇప్పటికే ఆయన అభ్యర్థిత్వం ఖరారయినట్లు సమాచారం. 

టిడిపి అభ్యర్థి :

తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజును ముమ్మిడివరం బరిలో నిలిపింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటమిపాలైనా మరోసారి అతడిపై నమ్మకం వుంచింది టిడిపి అదిష్టానం. 

ముమ్మిడివరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ;

ముమ్మిడివరం అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,92,043

వైసిపి - పొన్నాడ వెంకట సతీష్ - 78,522 (40 శాతం) - 5,547 ఓట్ల మెజారిటీతో విజయం

టిడిపి - దాట్ల సుబ్బరాజు - 72,975 (38 శాతం) - ఓటమి 

జనసేన పార్టీ - పితాని బాలకృష్ణ - 33,334 (17 శాతం) 

ముమ్మిడివరం అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,73,378 (83 శాతం)

టిడిపి - దాట్ల సుబ్బరాజు - 99,274 (56 శాతం) - 29,538 ఓట్ల మెజారిటీతో విజయం

వైసిపి - గుత్తుల వెంకట సాయి శ్రీనివాసరావు - 68,736 (39 శాతం) - ఓటమి