టీటీడీకీ భారీ విరాళం ప్రకటించాడు ముంబైకి చెందిన ఓ భక్తుడు. సంజయ్ సింగ్ అనే శ్రీవారి భక్తుడు దాదాపు రూ.300 కోట్లతో 300 పడకల ఆసుపత్రిని నిర్మించి అప్పగించేందుకు ముందుకొచ్చాడు.

భక్తుడు సంజయ్ సింగ్ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో ఎంఓయూ చేసుకున్నారు. త్వరలోనే ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన జరపనున్నారు. మరోవైపు సంజయ్ సింగ్‌ని అభినందించి టీటీడీ.

మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం 49,707 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 2.99 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న 21,638 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.