ప్రభుత్వం కాపుల ఉద్యమాన్ని అడ్డుకోవాలని చూస్తోందని ఆరోపించారు.

ఎట్టకేలకు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం సత్యాగ్రహ దీక్షలో కూర్చున్నారు. కాపులకు రిజర్వేషన్ డిమాండ్లతో ముద్రగడ కొద్ది రోజులుగా చేయాలనుకున్న ఆందోళనలకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు అడ్డుపడుతూనే ఉంది. పాదయత్ర చేద్దామన్నా, బహిరంగ సభ నిర్వహించాలన్నా, ర్యాలీలు నిర్వహించటానికి కూడా ప్రభుత్వం అనుమతించటం లేదు. దాంతో కర్నూలులో చేద్దామనుకున్న సత్యాగ్రహ దీక్షకైనా ప్రభుత్వం అనుమతి ఇస్తుందా అన్న అనుమానాలు సర్వత్రా నెలకన్నాయి. ఈ నేపధ్యంలో ఆదివారం కర్నూలులోని మెగాసిటీ ఫంక్షన్ హాలులో మొదలుపెట్టిన సత్యాగ్రహ దీక్ష ప్రశాంతంగానే మొదలైంది.

ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ ప్రభుత్వం కాపుల ఉద్యమాన్ని అడ్డుకోవాలని చూస్తోందని ఆరోపించారు. అయితే, ఎవరు అడ్డుకున్నా ఉద్యమం మాత్రం ఆగదని కూడా స్పష్టం చేసారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు కాపులకు బిసిల రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్ చేసారు. ముద్రగడతో పాటు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు కాపు నేతలు కూడా దీక్షలో కూర్చున్నారు.