చంద్రబాబు రోగానికి దేశంలో మందు లేదు: ముద్రగడ లేఖ

చంద్రబాబు రోగానికి దేశంలో మందు లేదు: ముద్రగడ లేఖ

కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై కాపు నేత ముద్రగడ పద్మనాభం తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో చంద్రబాబు రోగానికి మందు లేదని, అందువల్ల జబ్బు బాగా ముదిరిపోయిందని ఆయన అన్నారు. లోకేష్‌ మంత్రి పదవి కోసం ఓ పూజారిని సంప్రదించారని అంటూ కానీ పూజారి అడిగిన ప్రశ్నకు ఇంత వరకూ చంద్రబాబు ఎందుకు సమాధానం ఇవ్వలేదని ప్రశ్నించారు. 

తనను ఎదిరించే వారిని అదే కులస్తులతో తిట్టించే దురలవాటు ముఖ్యమంత్రికి ఉందని విమర్శించారు. చంద్రబాబును ఏదో జబ్బు వేధిస్తోందని, దాని కారణంగానే ఇలాంటి దురలవాటు ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

వంశపారపర్యంగా అర్చకత్వం ఉండకూడదన్న చంద్రబాబు లోకష్‌కు ఈ నియయం ఎందుకు వర్తింపజేయరని అడిగారు. ఆదివారం ఆయన చంద్రబాబుకు ఓ బహిరంగ లేఖ రాశారు.  తిరుమల తిరుపతి దేవస్థానంలో తవ్వకాలు, ఆస్తుల అవకతవకలపై సీబీఐ దర్యాప్తు చేయించాలని, ఈమేరకు చంద్రబాబు ప్రధానిని కోరాలని డిమాండ్‌ చేశారు. 

తాను నిప్పు అని పదే పదే చంద్రబాబు చెబుకుంటున్నారని,  అదే నిజమైతే దర్యాప్తు ముందు నిలబడాలని అన్నారు. బురద చల్లడం చంద్రబాబుకు కొత్తేం కాదని అన్నారు.  ఇతర పార్టీల సహకారంతో తాను ఉద్యమం చేస్తున్నానని చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్లో ఇసుమంతైనా నిజం లేదని వెల్లడించారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page