కాపు రిజర్వేషన్ ఉద్యమంలో ఆఖరిఘట్టం జరుగుతోందని.. సవరణలతో కూడిన కొత్త బిల్లును అసెంబ్లీలో ఆమోదించాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో 40 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుందని.. దీనిలో కాపుల వాటా 5 శాతం రిజర్వేషన్ దక్కేలా చూడాలని ముద్రగడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల విషయంలో ఇతర కులాలతో కాపులకు పోటీ లేదని.. ఇతర బీసీ కులాలకు రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉందని పద్మనాభం అభిప్రాయపడ్డారు.