చంద్రబాబుకు లక్ష మందితో ఘన సన్మానం చేస్తామని ముద్రగడ పద్మనాభం తెలిపారు.
కాపులను బీసీల్లో చేర్చుతామని హామీ ఇచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా కాపులకు ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శించారు. ఈ అసెంబ్లీ సమావేశాలకు ముందే కాపులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని పట్టుబట్టారు. కాపులకు ఇచ్చిన హామీని నెరవేరిస్తే చంద్రబాబుకు లక్ష మందితో ఘన సన్మానం చేస్తామని ముద్రగడ పద్మనాభం తెలిపారు.
Add Asianetnews Telugu as a Preferred Source

