మిస్సెస్ సింగపూర్ 2023 : మిసెస్ ఏసియా వరల్డ్ వైడ్ గా పులివెందులకు చెందిన విజయారెడ్డి
మిసెస్ ఏసియా వరల్డ్ వైడ్ గా తెలుగు మహిళ విజయం సాధించారు. ఏపీలోని పులివెందులకు చెందిన విజయారెడ్డి ఎన్నికయ్యారు.
పులివెందుల : మిస్సెస్ సింగపూర్ 2023 పోటీల్లో ఏషియా వరల్డ్ వైడ్ కేటగిరీలో వైయస్సార్ జిల్లా మహిళ విజేతగా గెలిచారు పులివెందుల మండలంలోని నల్లపురెడ్డిపల్లి గ్రామానికి చెందిన గోపాల్ రెడ్డి రమాదేవి కుమార్తె విజయరెడ్డి సింగపూర్ లో ఎంబీఏ చదువుకున్నారు. ఆ సమయంలో అక్కడే పరిచయం అయిన విజయవాడకు చెందిన సుంకర ప్రదీప్ ను ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు.
విజయ రెడ్డి, ప్రదీప్లు ఇద్దరు ప్రస్తుతం గత 15 ఏళ్లుగా సింగపూర్ లోనే ఉంటున్నారు. సింగపూర్ లోని సిటీ బ్యాంకులో పనిచేస్తున్నారు. ఇటీవల సింగపూర్ లుమియర్ అంతర్జాతీయ సంస్థ అందాల పోటీలు నిర్వహించింది. అక్టోబర్ 21న జరిగిన ఈ పోటీల్లో విజయ రెడ్డి పాల్గొన్నారు. విజేతగా పిలిచారు. దీని మీద విజయ రెడ్డి మాట్లాడుతూ మొదటి ప్రయత్నంలోనే విజేత కావడం చాలా ఆనందంగా ఉందన్నారు.