Asianet News TeluguAsianet News Telugu

మారణహోమం ఆగాలంటే మావోలతో చర్చలు జరపాల్సిందే: మందకృష్ణ మాదిగ

 మన్యంలో మారణహోమం ఆగాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులతో చర్చలు జరపాల్సిందేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ స్పష్టం చేశారు. మావోయిస్టుల డిమాండ్లపై మావో అగ్రనేత గణపతితో ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రంలో ఆర్కేతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చలు జరపాలని సూచించారు. 

Mrps founder manda krishna madhiga advises to govt. to discuss mavos
Author
Visakhapatnam, First Published Sep 25, 2018, 3:13 PM IST

విశాఖపట్నం: మన్యంలో మారణహోమం ఆగాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులతో చర్చలు జరపాల్సిందేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ స్పష్టం చేశారు. మావోయిస్టుల డిమాండ్లపై మావో అగ్రనేత గణపతితో ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రంలో ఆర్కేతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చలు జరపాలని సూచించారు. 

గిరిజన ప్రజా ప్రతినిధులను మావోయిస్టులు హత్య చేయడం బాధాకరమన్న ఆయన మావోయిస్టుల్లో వచ్చిన వర్గ దృక్పథం వల్లే గిరిజన నేతలను సైతం హతమార్చారని ఆరోపించారు. మరోవైపు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రజాప్రతినిధులు హత్యకు గురైన తర్వాత వారి మృతదేహాలను బంధువులు తెచ్చుకున్నారే తప్ప పోలీసులు తీసుకురాలేదన్నారు. పోలీసుల వైఫల్యమే ఘటనకు కారణమని ఆరోపించారు. పోలీసు శాఖలో కింది నుంచి పై స్థాయి అధికారుల వరకు బాధ్యులను చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios