ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీలకు సంబంధించి మార్చి 21న తొలి విడత, మార్చి 24న రెండో విడత పోలింగ్‌ నిర్వహించనున్నారు. మార్చి 27న పురపాలక సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీల రెండింటికీ కలిపి మార్చి 29న కౌంటింగ్ నిర్వహించనున్నారు. అదే సమయంలో రాష్ట్రంలోని 13 జిల్లా పరిషత్ ఛైర్మన్‌ పదవులకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 

జిల్లాల వారీగా రిజర్వేషన్లు:

శ్రీకాకుళం- బీసీ (మహిళ)
విజయనగరం- జనరల్
విశాఖపట్నం- ఎస్టీ (మహిళ)
తూర్పుగోదావరి- ఎస్సీ (మహిళ)
పశ్చిమ గోదావరి- బీసీ
కృష్ణా- జనరల్ (మహిళ)
గుంటూరు- ఎస్సీ (మహిళ)
ప్రకాశం- జనరల్ (మహిళ)
నెల్లూరు- జనరల్ (మహిళ)
చిత్తూరు- జనరల్
కడప- జనరల్
అనంతపురం- బీసీ (మహిళ)
కర్నూలు- జనరల్

Also Read:

ఆ మంత్రులు రాజీనామా చేయాల్సిందే...ఎమ్మెల్యేలు కూడా...: సీఎం జగన్ హెచ్చరిక

నెల రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు:జగన్