వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి చంద్రబాబు పై విమర్శలు గుప్పించారు. పల్నాటి పులి అంటూనే కోడెలను చంద్రబాబు తీవ్ర క్షోభ గురిచేశారని  విజయసాయి పేర్కొన్నారు.  ఎల్లమీడియా సహాయంతో చంద్రబాబు తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారంటూ విజయసాయి మండి పడ్డారు.

‘‘ఎల్లో మీడియా సౌజన్యంతో కోడెల గారి అంత్యక్రియలు పూర్తయ్యేవరకు చంద్రబాబు తన ఈవెంట్ మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌ను అద్భుతంగా ప్రదర్శించారు. అంతకు ముందు వర్ల వంటి వారిని ఆయనపైకి ఉసిగొల్పి అవమానించారు. పల్నాటి పులి అంటూనే తీవ్ర క్షోభకు గురిచేశారు.’’ అని ఆరోపించారు.

మరో ట్వీట్ లో.. ‘‘పరీక్ష రాసిన అభ్యర్థులతో ఏదో ఒక ఫిర్యాదు చేయించాలని మీ అనుకూల మీడియా ఎగ్జామ్‌ సెంటర్ల చుట్టూ తిరిగింది. ఎవరూ తప్పుపట్టలేదు. చివరకు తమరే పూనుకుని ప్రశ్నాపత్రం లీక్ అయిందని గొల్లుమనడం ఊహించిందే కదా చంద్రబాబు గారూ. మీలాంటి జ్ఞాని అలా అనకపోతేనే ఆశ్చర్య పోవాలి. ’’ అంటూ చురకలు వేశారు.

ఇంకో ట్వీట్ లో ‘‘1983లో టీడీపీ అధికారంలోకి వచ్చాక టీచర్లుగా ఎంపికైన వారికి నెలకు రూ.398 వేతనంగా ఇచ్చి ఏళ్ల తరబడి హింసించింది. ఇప్పుడు 4 లక్షల మంది గ్రామ సచివాలయ ఉద్యోగులను నియమిస్తుంటే చంద్రబాబు ముఠా కళ్లలో నిప్పులు పోసుకుంటోంది. జీత భత్యాలపై శాడిస్టిక్ సెటైర్లు వేస్తోంది. ’’ అంటూ మండిపడ్డారు.