ఇంటి పైకప్పు మీదే జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి లోకేశ్‌ నాయుడు ఒక్కరే. ఇది ఆయన శుద్ధ బద్ధకానికి, తీవ్ర అధికార దుర్వినియోగానికి నిదర్శనం

ఏపీ మంత్రి నారా లోకేష్ బద్ధకస్తుడని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. లోకేష్ బద్ధకంతో ఇంటిపై కప్పుపైనే జాతీయ జెండా ఎగురవేశారని ఆయన అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. ‘స్వాతంత్య్ర దినోత్సవం రోజు పోలీసులతో గౌరవ వందనం అందుకుని ఇంటి పైకప్పు మీదే జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి లోకేశ్‌ నాయుడు ఒక్కరే. ఇది ఆయన శుద్ధ బద్ధకానికి, తీవ్ర అధికార దుర్వినియోగానికి నిదర్శనం’ అని ట్వీట్‌ చేస్తూ దీనికి సంబంధించిన ఫోటోలను విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Scroll to load tweet…

అదేవిధంగా రాహుల్ గాంధీ.. హైదరాబాద్ లో చంద్రబాబు కోడలు నారా బ్రహ్మణిని కలవడంపై కూడా విజయసాయిరెడ్డి మండిపడ్డారు. రాహుల్‌గాంధీకి నీచ రాజకీయాలు మాత్రమే తెలుసని, ఎంతకైనా దిగజారతారని తెలియజేస్తోందని అన్నారు. చంద్రబాబు సీఎం పదవి నుంచి కిందకు దిగినప్పుడే..ఏపీకి స్వాతంత్ర్యం వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.