ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శల వర్షం కురిపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచిన నాటి నుంచి చంద్రబాబుపై విజయసాయి ట్వీట్ల దాడి ఎక్కువ చేశారు.

తాజాగా మరోసారి చంద్రబాబుపై విమర్శలు కురిపించారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు రాజకీయ కమెడియన్ పాత్ర పోషించారని విమర్శించారు. ఇప్పుడు అదే పాత్రలో చంద్రబాబు మరో హాస్య గుళిక వదిలారంటూ ఎద్దేవా చేశారు. 

ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ ని గెలిపించింది తానేనని చంద్రబాబు చెబుతున్నారని మండిపడ్డారు. రాసి చూపించే మీడియా ఉందని.. చంద్రబాబు తన ఇష్టానికి మాట్లాడుతున్నారన్నారు.

అప్పట్లో తన దగ్గర నేర్చుకున్న ఎత్తుగడలతోనే ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని కూడా చంద్రబాబు ప్రచారం చేసుకుంటారేమో అని విజయసాయి ఎద్దేవా చేశారు.