Asianet News TeluguAsianet News Telugu

పవనిజమంటే ఇదేనా..? మానసిక స్థితి సరిగాలేదా.. పవన్ పై విజయసాయి

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటనపై పవన్‌ స్పందిస్తూ.. వైద్యురాలిపై హత్యాచారం చేసిన నలుగురిని జైల్లో పెడితే.. జైలు దగ్గరకు వేలమంది వెళ్లి.. ఉరితీయాలని, చంపేయాలని అంటున్నారు. ఢిల్లీ స్థాయిలో ఓ జడ్జి రేప్‌ కేసు గురించి మాట్లాడుతూ మగవాళ్ల మర్మాంగాలను కోసేయండన్నారు. అంత స్థాయికి ఎందుకు తీసుకువెళుతున్నారు. 

mp Vijayasai Reddy Allegations To Janasena Chief Pawan Kalyan
Author
Hyderabad, First Published Dec 4, 2019, 1:37 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మండిపడ్డారు.  పవన్ మతిస్థిమితం సరిగాలేదేమోనని చురకలు వేశారు. ట్విట్టర్ వేదికగా... పవన్ పై విజయసాయి తీవ్ర విమర్శలు చేశారు.

గత కొద్దిరోజులుగా సీఎం  జగన్ ని టార్గెట్ చేసి పవన్ కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ పై విజయసాయి కౌంటర్లు వేశారు. ‘రేపిస్టులకు ఉరిశిక్ష ఎలా వేస్తారని ప్రశ్నిస్తున్నాడంటే మానసిక స్థితిలో ఏదో సీరియస్ ప్రాబ్లమ్ ఉన్నట్టే. దేశమంతా కఠినంగా శిక్షించాలని కళ్ల నీళ్లు పెంటుకుంటుంటే ఈయనకు రేపిస్టుల ప్రాణాలు ముఖ్యమై పోయాయి. పవనిజం అంటే ఇదేనేమో? రాజకీయ పార్టీ పెట్టింది ఇందుకేనా?’  అని విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా ప్రశ్నించారు. 

AlsoRead వైసీపీ వైపు మరో మాజీ ఎమ్మెల్యే... చంద్రబాబుకి మరో షాక్...

కాగా, దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటనపై పవన్‌ స్పందిస్తూ.. వైద్యురాలిపై హత్యాచారం చేసిన నలుగురిని జైల్లో పెడితే.. జైలు దగ్గరకు వేలమంది వెళ్లి.. ఉరితీయాలని, చంపేయాలని అంటున్నారు. ఢిల్లీ స్థాయిలో ఓ జడ్జి రేప్‌ కేసు గురించి మాట్లాడుతూ మగవాళ్ల మర్మాంగాలను కోసేయండన్నారు. అంత స్థాయికి ఎందుకు తీసుకువెళుతున్నారు. 

ఆడపిల్ల బయటకువెళ్లి ఇంటికి తిరిగిరాకపోతే.. ఆడపిల్ల మీద ఏదైనా జరిగితే.. చేసిన అబ్బాయిని రెండు బెత్తం దెబ్బలు చెమ్డాలు ఊడిపోయేలా కొట్టాలి. అందరూ చూస్తుండగా కొట్టాలి’ అని పేర్కొన్నారు. అత్యంత కిరాతకంగా, అమానుషంగా షాద్‌నగర్‌ శివార్లలో దిశను అత్యాచారం చేసి హతమార్చిన ఘటనపై ప్రజాగ్రహం పెల్లుబుక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios