అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టటంపై తమపార్టీకి మాత్రమే పేటెంట్ హక్కుందని వైసిపి బల్లగుద్ది చెబుతోంది. నాలుగు ఏళ్ళపాటు ప్రజల ముందు డ్రామాలాడిన టిడిపి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టటం కేవలం ప్రజలను మోసం చేయటమేనని మండిపడుతోంది. వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది కాబట్టి తమ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు.

కాబట్టే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు వైసిపికి మాత్రమే పేటెంట్ హక్కుందని స్పష్టంగా ప్రకటించారు. నాలుగేళ్ళ అభివృద్ధిపైన, ప్రత్యేకహోదా, ప్రత్యేకప్యాకేజిపైన చంద్రబాబు ఎన్ని అబద్దాలు చెప్పారో అందరికీ తెలిసిందన్నారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా తాము జాతీయ పార్టీల అధినేతలను కలుస్తున్నట్లు చెప్పారు. తమ పార్టీకి టిడిపి మద్దతు ఇచ్చినా పర్వాలేదని లేకపోతే టిడిపి పెట్టే అవిశ్వాస తీర్మానానికి తామే మద్దతు ఇవ్వటానికి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.