లోక్ సభ వాయిదా పడిన తర్వాత పార్లమెంటు సెంట్రల్ హాలులో ఉన్న తన దగ్గరకు వచ్చి ఎంపీ మాధవ్ అసభ్య పదజాలంతో దూషించాడని ఆయన పేర్కొన్నారు. మరోసారి టీవీల్లో కనిపిస్తే అంతం చేస్తామని బెదిరించారన్నారు.
టీవీల్లో కనిపిస్తే.. అంతం చేస్తామంటూ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్.. తనను బెధిరించారని ఎంపీ రఘురామ కృష్ణం రాజు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్రమోదీ, లోక్ సభ సభాపతి ఓం బిర్లాకు గోరంట్లపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారికి లేఖలు కూడా రాశారు.
మంగళవారం ఉదయం లోక్ సభ వాయిదా పడిన తర్వాత పార్లమెంటు సెంట్రల్ హాలులో ఉన్న తన దగ్గరకు వచ్చి ఎంపీ మాధవ్ అసభ్య పదజాలంతో దూషించాడని ఆయన పేర్కొన్నారు. మరోసారి టీవీల్లో కనిపిస్తే అంతం చేస్తామని బెదిరించారన్నారు.
తన దగ్గరకు రావడానికి ముందు ఆయన తమ పార్టీ ఎంపీల దగ్గర కూర్చున్నారని చెప్పారు. బహుశా వాళ్లు రెచ్చగొట్టడం వల్లే తనకు వార్నింగ్ ఇచ్చి ఉంటారని తాను అనుకుంటున్నట్లు చెప్పారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులోని సీసీటీవీలను పరిశీలిస్తే.. తనను బెదిరించిన దృశ్యాలు కనిపిస్తాయన్నారు,
సభా నాయకుడిగా ఉన్న ప్రధాని దృష్టికి తాను ఈ వాస్తవాలను తీసుకువస్తున్నట్లు చెప్పారు. ఈ అంశంపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా.. కేంద్రం విడుదల చేసిన ఉపాధి నిధులను ఇతర పథకాలకు మళ్లించారని.. ప్రజలు అభిప్రాయపడుతున్నారని.. ఈ విషయంపై విచారణ జరిపి అసలు నిజా నిజాలు బయటపెట్టాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ని కూడా ఎంపీ రఘరామ కోరారు. ఈ మేరకు ఆయనకు కూడా లేఖ రాశారు.
