Asianet News TeluguAsianet News Telugu

ప్రధానికి లేఖ రాసిన ఎంపీ రఘురామకృష్ణరాజు..

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖల యుద్ధం కొనసాగుతోంది. తాగాజా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో లేఖ రాశారు. రాష్ట్రాల్లో ఉచిత పథకాల కారణంగా ఖజానాలు ఖాళీ అవుతన్నాయని అందులో పేర్కొన్నారు. 

mp raghurama krishnaraju letter to prime minister narendra modi - bsb
Author
Hyderabad, First Published Mar 20, 2021, 2:43 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖల యుద్ధం కొనసాగుతోంది. తాగాజా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో లేఖ రాశారు. రాష్ట్రాల్లో ఉచిత పథకాల కారణంగా ఖజానాలు ఖాళీ అవుతన్నాయని అందులో పేర్కొన్నారు. 

కోలుకోలేని అప్పుల్లో రాష్ట్రాల్లో కూరుకుపోతున్నాయని వివరించారు. ప్రభుత్వాలు లబ్ధిదారులను ోటు బ్యాంకుగానే చూస్తున్నాయని లేఖలో రఘురామకృష్ణరాజు తెలిపారు. ోట్ల కోసం నిధులను కూడా ఉచితాలపై తరలిస్తున్నారని ఎంపీ ఫిర్యాదు చేశారు. 

చట్టం ద్వారా ఉచిత పథకాలపై నియంత్రణ తీసుకురావాలని లేఖలో ప్రధానిని కోరారు. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య కేంద్రం వివక్ష ఆరోపణలకు ఇదే మూలమని అందులో పేర్కొన్నారు. ఇటీవల లోక్ సభలోనూ ఎంపీ ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios