Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో రాజకీయ సంక్షోభం.. బాంబు పేల్చిన రఘురామ కృష్ణం రాజు

నాని కేవలం హత్యకు వాడిన కత్తి అన్నారు. అతని కంటే హత్య చేసిన చేయి.. అంటే మాట్లాడించిన వ్యక్తిదే మొత్తం తప్పన్నారు. నానిని ఒక ఆయుధంగా నిమ్మగడ్డపైకి ప్రయోగించారు. ఒకరి తర్వాత ఒకరుగా పద్ధతి ప్రకారం రాజ్యాంగ వ్యవస్థలపై దాడి చేస్తున్నారు. ఇది కచ్చితంగా రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తుందన్నారు.
 

MP Raghurama krishnama Raju Shocking comments on YCP Govt
Author
Hyderabad, First Published Nov 21, 2020, 4:28 PM IST

ఏపీ రాజకీయాల్లో రాజకీయ సంక్షోభం తప్పదంటూ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు మూడు నెలల్లో రాష్ట్ర పతి పాలన విధించి స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డను కుక్కతో పోల్చడం చాలా తప్పు అని చెప్పారు.

ఇటీవల నిమ్మగడ్డపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై కూడా రఘురామ కృష్ణం రాజు స్పందించారు. మంత్రిపై చర్యలు కోరుతూ నిమ్మగడ్డ కూడా ఫిర్యాదు చేశారని.. కానీ కొనాలి నానిని ఓ పనిముట్టుగా, రాజ్యాంగ వ్యవస్థల హత్యకు ఆయుధంగా వాడుకున్నారేగానీ, తెర వెనుక ఉండి ఇదంతా నడిపిస్తున్నది సీఎం జగనే అన్నారు. 

నాని కేవలం హత్యకు వాడిన కత్తి అన్నారు. అతని కంటే హత్య చేసిన చేయి.. అంటే మాట్లాడించిన వ్యక్తిదే మొత్తం తప్పన్నారు. నానిని ఒక ఆయుధంగా నిమ్మగడ్డపైకి ప్రయోగించారు. ఒకరి తర్వాత ఒకరుగా పద్ధతి ప్రకారం రాజ్యాంగ వ్యవస్థలపై దాడి చేస్తున్నారు. ఇది కచ్చితంగా రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తుందన్నారు.

ఇప్పటికైనా నిమ్మగడ్డతో రాద్ధాంతానికి స్వస్తి పలకాలి అన్నారు ఎంపీ. ఇళ్ల స్థలాలను లబ్ధిదారులకు కిస్మస్‌ కానుకగా ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఇళ్ల స్థలాల పేరుతో 90 లక్షల మందిని మత మార్పిడి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో 29,880 మంది పాస్టర్లకు మత ప్రచారం కోసం ప్రభుత్వం నెలకు రూ.14.94 కోట్లు చెల్లిస్తోందన్నారు. 

కరోనాతో చనిపోయిన తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాదరావు కుటుంబ సభ్యులకు టికెట్‌ ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఆ కుటుంబానికి అన్యాయం చేసి తన వ్యక్తిగత వైద్యుడైన గురుమూర్తికి సీఎం జగన్‌ టికెట్‌ ఇవ్వడాన్ని తప్పుబట్టారు.

Follow Us:
Download App:
  • android
  • ios