జగన్మోహనపురం.. సిగ్గులేని వెధవ చెప్తేనే..: ఎంపీ రఘురామ సంచలనం
క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి పర్వదినాన మరోసారి వైసీపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ రఘురామ కృష్ణంరాజు.
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు సొంతపార్టీ వైసీపీకి ఎదురుతిరిగిన ఇటీవల కాలంలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇలా ఆయన క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి పర్వదినాన మరోసారి వైసీపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
''నేడు పేదలకు ఇస్తున్న ఇళ్ల స్థలాలలో గతంలోనే అనేక అక్రమాలు, అవినీతి చోటుచేసుకుందని ఫిర్యాదు చేసిన పట్టించుకోని ప్రభుత్వం... నేడు జగనన్న పురం అని పేరు పెట్టడం సిగ్గుచేటు. రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే సుమారు ఆరువేల కాలనీలకు జగనన్నపురం అని పేరు పెడితే రానున్న రోజుల్లో వచ్చే ముఖ్యమంత్రుల పేర్లు పెడతారా..? సిగ్గు లేని వాళ్ళు చెప్తే మీరు ఎలా విన్నారు'' అంటూ సీఎం జగన్ ను సూటిగా ప్రశ్నించారు రఘురామ కృష్ణంరాజు.
read more జగన్ పుట్టిన రోజు వేడుక: సంచలన ఆరోపణలతో రఘురామ సెల్ఫీ వీడియో
ఇటీవల ముఖ్యమంత్రి జగన్ పదవికి జగన్ రాజీనామా చేయాల్సి రావచ్చునని ఇటీవలే ఎంపీ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రులు నీలం సంజీవ రెడ్డి, ఎన్ జనార్దన్ రెడ్డిల మాదిరిగానే జగన్ కూడా రాజీనామా చేయాల్సి రావచ్చునని అన్నారు. కోర్టు ధిక్కరణ నోటీసులు తీసుకోవడానికి జగన్ రేపో మాపో సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు.
కోర్టు నోటీసులపై తమ వైసీపీలో ఆందోళన వ్యక్తమవుతోందని, తప్పు అంగీకరించి క్షమాపణ కోరితే జగన్ కు శిక్ష తప్పే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఎన్ని సంక్షేమ పథకాలు అమలుచేసినా జగన్ కు దుబ్బాక ఫలితం తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. అమరావతి మాత్రమే ఏపీకి రాజధానిగా ఉంటుందని ఆయన అన్నారు జనగ్ మతమార్పిడులను ప్రోత్సహిస్తున్నారని ఆయన విమర్శించారు. సింహాద్రి, మాన్సాస్ భూములపై పెద్దల కన్ను పడిందని ఆయన అ్ననారు
వైసీపీ నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నీకైన రఘురామకృష్ణమ రాజు చాలా కాలంగా వైఎస్ జగన్ ప్రభుత్వం తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. అందుకు గాను ఆయనపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాకు పిటిషన్ కూడా పెట్టుకున్నారు.