తెలంగాణ ప్రభుత్వ పథకాలను కాపీ కొట్టాల్సిన ఖర్మ తమ ప్రభుత్వానికి, పార్టీ కి లేదని ఎంపీ కొనకళ్ల నారాయణ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ నేతలు టీడీపీలో ట్రైనింగ్ తీసుకొని అరకొరగా పథకాలు అమలు చేస్తున్నారని విమర్శించారు. 

మిగులు బడ్జెట్ ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేయని స్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందన్నారు. లోటు బడ్జెట్ ఉన్నా ఏపీలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. 

కోడికత్తి కేసు దర్యాప్తు ఎన్ఐఏకు ఇవ్వడం రాష్ట్ర హక్కులను కాలరాయడమే అని అన్నారు. కాపులకు రిజర్వేషన్లపై టీడీపీ మాట నిలబెట్టుకుందని ఎంపీ కొనకళ్ల స్పష్టం చేశారు.