వైసీపీ నేత విజయసాయి రెడ్డిపై బీజేపీ ఎంపీ హరిబాబు మండిపడుతున్నారు. టీడీపీ నేతల స్పెషల్ ఫ్లైట్ లో బీజేపీ ఎంపీ హరిబాబు అంటూ.. విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ కి.. హరిబాబు తాజాగా కౌంటర్ ఇచ్చారు. ఇంతకీ మ్యాటరేంటంటే.. సోమవారం దేశరాజధాని ఢిల్లీలో చంద్రబాబు దీక్ష  చేపట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ.. ఆయన ఈ దీక్ష చేపట్టారు.

అయితే.. ల్లీలో దీక్షలో పాల్గొనే వారి కోసం తెలుగుదేశం పార్టీ ఛార్టెడ్ ఫ్లైట్ బుక్ చేసింది. ఇందులో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే కీలక నేతలు ఉన్నారు. వీరిలో బీజేపీ ఎంపీ హరిబాబు ఉండటం తీవ్ర కలకలం రేపింది.

ఈ ఫోటోలను వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్‌లో షేర్ చేశారు.  పబ్లిగ్గా దుమ్మెత్తి పోసుకుంటున్నా...రహస్యంగా టీడీపీ-బీజేపీ అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నారంటూ మండిపడుతూ ట్వీట్ చేశారు. కాగా.. ఆ ట్వీట్ కి హరిబాబు ఘాటుగా సమాధానం ఇచ్చారు.

విమానంలో ఏ పార్టీ వాళ్లయినా ట్రావెల్ చేయవచ్చని హరిబాబు పేర్కొన్నారు. ఈ విషయంలో ఎలాంటి నిషేధం లేదని విజయసాయిరెడ్డి కి హరిబాబు సూచించారు. సహ ప్రయాణికులు ఎవరన్న విషయం తనకు అనవసరమన్నారు. తన విమానం ట్రావెల్ కి సంబంధించిన టికెట్లను కూడా ఈ సందర్బంగా హరిబాబు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే.. హరిబాబు పెట్టిన ట్వీట్.. కొద్ది సేపటి తర్వాత ట్విట్టర్ లో మాయం కావడం గమనార్హం.