హీరో సుమంత్ కి సవాలు విసిరిన ఎంపీ గల్లా జయదేవ్

MP galla jayadev challenge to hero sumanth
Highlights

ఇది ఫిట్ నెస్ ఛాలెంజ్ కాదు..

కేంద్ర మంత్రి రాజ్యవర్థన్‌రాథోడ్‌ మొదలుపెట్టిన ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ కి ఫుల్ పాపులారిటీ సంతరించుకుంది. పలువురు సెలబ్రిటీలు ఒకరినొకరు నామినేట్‌ చేసుకుంటూ చేసి చూపించారు. ఇప్పుడు మరో ఛాలెంజ్‌ ప్రారంభమైంది. ‘#hugAtree’ ఛాలెంజ్‌ వైరల్‌ అయింది. తెదేపా ఎంపీ గల్లాజయ్‌‌దేవ్‌ చెట్టును కౌగిలించుకుని, ‘మన జీవితంలో చెట్లు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకు వాటికి ఓ వెచ్చటి కౌగిలిని ఇవ్వడం ద్వారా వేడుక చేసుకుందాం. ఈ ఛాలెంజ్‌ను మీరూ తీసుకోండి. అంతేకాదు, మరో అయిదుగురిని ఇందుకోసం నామినేట్‌ చేయండి’ అంటూ ఆయన అశోక్‌ గల్లా, సిద్ధార్థ్‌ గల్లా, సుధీర్‌బాబు, సుమంత్‌, రానా దగ్గుబాటిలకు ఈ ఛాలెంజ్‌ను విసిరారు.

దీనికి స్పందించిన సుమంత్‌ తన కుక్కతో పాటు చెట్టును కౌగిలించుకుని ‘నా బాయ్‌తో కలిసి ఛాలెంజ్‌ను పూర్తి చేశా. అఖిల్‌, నాగచైతన్య, సమంత, సుశాంత్‌, కృతి కర్బందాలను నామినేట్‌ చేస్తున్నా’ అని సమాధానం ఇచ్చారు. ఇటీవలే ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘#hugAtree’కు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

loader