విశాఖపట్నం:  మంత్రి గంటా శ్రీనివాసరావుపై అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు సెటైర్ వేశారు. భీమిలి నుంచి వైఎస్ జగన్ వచ్చి పోటీ చెయ్యాలని మంత్రి గంటా శ్రీనివాస్ విసిరిన సవాల్ పై స్పందించిన అవంతి శ్రీనివాస్ టీడీపీ నేతలు ప్రస్టేషన్ లో ఉండటం వల్లే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆరోపించారు. 

బుధవారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రస్తుతం టీడీపీ నేతలు ప్రస్టేషన్లో ఉన్నారని అందుకే వైఎస్ జగన్ ను భీమిలికి వచ్చి పోటీ చెయ్యాలంటున్నారని ఎద్దేవా చేశారు. 

త్వరలో ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ ను కూడా భీమిలి నుంచే పోటీ చెయ్యమన్నా ఆశ్చర్య పడక్కర్లేదన్నారు. ఇకపోతే భీమిలి నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి వైఎస్‌ జగన్‌కు ఆ గెలుపును బహుమతిగా ఇస్తానని అవంతి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.