ఒంటరిగా ఉన్నప్పుడు జగన్ ను కౌగలించుకుంటావు: జెసిపై శ్రీకాంత్ రెడ్డి

Motkupalli Narsimhulu says Pawan Kalyan helped Chnadrababu
Highlights

తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై విమర్శలు చేసిన తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డిపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు.

హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై విమర్శలు చేసిన తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డిపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఒంటరిగా ఉన్నప్పుడు "నువ్వు మావాడివి, సిఎంవి కావాల"ని కౌగలించుకుంటావు అని ఆయన జెసిని ఉద్దేశించి అన్నారు. 

జెసి దివాకర్ రెడ్డివి భజన రాజకీయాలని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. మీ పురాణాలు బయటపెడితే రోడ్ల మీద తిరగలేరని ఆయన జెసిని హెచ్చరించారు. ఏ అర్హత ఉందని వైఎస్ కుటుంబం గురించి మాట్లాడుతున్నావని అడిగారు. చంద్రబాబు ట్రాప్ లో పడి జెసి ఇష్టం వచ్ిచనట్లు మాట్లాడుతున్నారని అన్నారు. తాడిపత్రిలో జెసి అరాచాకాలకు అంతు లేదని అన్నారు.

ఒక్కరి పేరు చెప్తే వణికిపోయి జిల్లా నుంచి పారిపోయావని ఆయన జెసిని ఉద్దేశించి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా గెలువలేని స్థితి అని, 2004లో వైఎస్ దయతో ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రివి అయ్యావని, నీ గురించి తెలిసే వైఎస్ రెండోసారి నీకు మంత్రి పదవి ఇవ్వలేదని ఆయన అన్నారు. 

మహిళలు, చిన్న పిల్లలు ఉంటారని అటువంటి భాష మాట్లాడేటప్పుడు మాట్లాడవద్దని చంద్రబాబు జెసికి చెప్పాల్సి ఉండిందని అన్నారు. చంద్రబాబును సంతృప్తి పరిచేందుకు జెసి మాట్లాడుతున్నారని అన్నారు. టీడీపి నేతలు లక్షల కోట్లు దోచుకున్నారని, ధర్మపోరాట దీక్షకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని అన్నారు.  

చంద్రబాబుకు మద్దతిస్తూ పవన్ కల్యాణ్ మాట్లాడినప్పుడు మీడియా కవరేజీ ఇచ్చేదని, ప్రస్తుతం విమర్శిస్తుండడంతో కవరేజీ రాకుండా చూస్తున్నారని ఆయన అన్నారు. జెసి కులం పేరు చెప్పి తిట్టడానికి సిగ్గు ఉండాలని అన్నారు. మా చెల్లెలు ఎస్సీని పెళ్లి చేసుకుందని వైఎస్, మా అత్త ఎస్సీని పెళ్లి చేసుకుందని జగన్ గర్వంగా చెబుకున్నారని ఆయన గుర్తు చేశారు. 

చంద్రబాబు వాడుకుని ఎలా వదిలేస్తాడో మోత్కుుపల్లి నర్సింహులు, నాగం జనార్దన్ రెడ్డిని అడిగి తెలుసుకోవాలని ఆయన టీడీపి నేతలకు సూచించారు. మీ వ్యక్తిత్వాన్ని చంపుకోవద్దని ఆయన సలహా ఇచ్చారు. రమణదీక్షితులుపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వాడిన భాషను ఆయన తప్పు పట్టారు. కనీసమైన సంస్కారం కూడా లేకుండా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారని అన్నారు. 

వయస్సులో చిన్నవాడు,త లోకేష్ కూడా మాట్లాడుతున్నాడని ఆయన అన్నారు. బిజెపి తప్పు చేసిందని తాము కూడా చెబుతున్నామని ఆయన అన్నారు. జగన్ ను మొగాడు అని మోత్కుపల్లి వంటి టీడీపి నాయకులే అంటున్నారని ఆయన చెప్పారు.  జగన్ కు తాత బుద్ధులు వచ్చాయని నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ నీకు తాత బుద్ధులు వచ్చాయా అని అడిగారు. 

టీడీపిని విమర్శిస్తే తమకు బిజెపితో సంబంధం అంటగడుతారా అని అడిగారు. బిజెపి లెక్కలు తేలుద్దాం సరే, నాలుగేళ్లు మోసం చేసిన టీడీపి లెక్కలు కూడా తేలుద్దామని అన్నారు.

loader