చంద్రబాబు ఓడిపోవడమే...స్వర్గీయ ఎన్టీఆర్ కోరుకున్నారని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. గురువారం ఆయన తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
చంద్రబాబు ఓడిపోవడమే...స్వర్గీయ ఎన్టీఆర్ కోరుకున్నారని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. గురువారం ఆయన తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు ఓడిపోతే.. తిరుమలకు వస్తానని మొక్కుకున్నట్లు చెప్పారు. అందుకే చంద్రబాబు ఈ ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలయ్యారని వ్యాఖ్యానించారు.
ఎన్టీఆర్ మనోవాంఛ నెరవేరాలని గతంలో అలిపిరి నుంచి మెట్లు ఎక్కానని గుర్తుచేశారు. తను మొక్కును నెరవేర్చిన శ్రీవారికి ఇప్పుడు మొక్కు చెల్లించుకున్నానని ఆయన తెలిపారు.
మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కూడా గురువారం శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కావలి అభివృద్ధికి మరింత శ్రమిస్తానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్రం ఉన్నత స్థాయిలో నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
