Asianet News TeluguAsianet News Telugu

ప్రియుడితో రాసలీలలు: అడ్డుగా ఉన్నాడని కొడుకు హత్య

ప్రియుడితో రాసలీలలకు అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ తల్లి కన్నకొడుకును అత్యంత దారుణంగా హత్య చేయించింది. నెల రోజుల తర్వాత ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. 

Mother kills son with boyfriend in Guntur district
Author
Guntur, First Published Dec 30, 2019, 7:43 AM IST


మంగళగిరి: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో కన్నకొడుకును ప్రియుడితో కలిసి హత్య చేయించింది ఓ తల్లి.ఈ ఘటన గుంటూరు జిల్లా మంగళగిరిలో చోటు చేసుకొంది. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

మంగళగిరి మండలం పెద్దవడ్లపూడికి చెందిన చిలక బాలస్వామికి నంది వెలుగు పంచాయితీ పరిధిలోని జాషువానగర్‌కు చెందిన కసుకుర్తి రాణితో వివాహేతర సంబంధం ఏర్పడింది. రాణికి డిగ్రీ చదువుతున్న హార్థిక్ రాయ్ అనే కొడుకు ఉన్నాడు. 

తల్లి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కలిగి ఉండడంపై హార్ధిక్ రాయ్ తల్లిని నిలదీశాడు. దీంతో తమ బంధానికి కొడుకు అడ్డుగా ఉన్నాడని కసుకుర్తి రాణి భావించింది.ఈ విషయాన్ని ప్రియుడికి చేరవేసింది. హార్ధిక్‌రాయ్‌ను చంపేస్తే తమ బంధానికి ఎలాంటి అడ్డు ఉండదని భావించారు. 

ఈ ఏడాది నవంబర్ 18వ తేదీన తెనాలిలో కలుసుకొని హార్థిక్ రాయ్‌ను హత్య చేయాలని రాణి, బాలస్వామి ప్లాన్ చేశారు. ఈ మేరకు నవంబర్ 19వ తేదీన తమ ప్లాన్ ను అమలు చేశారు.

 కొత్త బట్టలు కొని పెడతానని చెప్పి రావాలని హార్ధిక్ రాయ్ బాలస్వామి ఫోన్ చేశాడు. ఈ విషయం నిజమేనని నమ్మిన హార్ధిక్ రాయ్  నందివెలుగు జాషువా నగర్ కు చేరుకొన్నారు. బాలస్వామి స్కూటర్‌పై తెనాలిలో రాణి పనిచేసే వాటర్ ప్లాంట్ వద్దకు తీసుకెళ్లాడు. ఆమెను కూడ వెంటతీసుకొని నందివెలుగు వద్దకు చేరుకొన్నారు.

ముగ్గురు అక్కడే టిఫిన్ చేశారు. అదే సమయంలో రాణిని బాలస్వామి పక్కకు పిలిచి హార్ధిక్‌రాయ్‌ను ఈ రోజు హత్య చేస్తానని, ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని ఆమెను ఆటోలో ఎక్కించి ఇంటికి పంపాడు. 

రాత్రి ఏడు గంటల సమయంలో బాలస్వామి హార్ధిక్ రాయ్ ను కొబ్బరి బొండాలు తాగి వద్దామని నమ్మించి మంగళగిరి మండలం పెద్దవడ్లపూడి  లాకుల వద్దకు తీసుకెళ్లాడు. పంటపొలంలో గల షెడ్డులోకి వెళ్లిన బాలస్వామి తాడును తీసుకువచ్చి వెనుకగా హార్ధిక్‌రాయ్‌ మెడకు బిగించి హత్య చేశాడు. మృతదేహాన్ని కాల్వలో వేసేందుకు జనసంచారం ఉండడంతో మరో పథకాన్ని అమలు చేశాడు.

హార్ధిక్‌రాయ్‌ మృతదేహాన్ని భుజాన వేసుకుని మురుగు కాలువ తూము వద్దకు తీసుకువెళ్లాడు. శవం పైకి తేలకుండా ఉండటానికి నడుముకు పెద్ద రాయికట్టి నీళ్లలో ఉన్న తూములో వేసి పారిపోయాడు. కొన్ని రోజుల తర్వాత కాల్వ నుండి దుర్వాసన రావడంతో రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోలీసులు వెలికితీయించారు.మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. సాంకేతిక ఆధారాలతో పోలీసులు ఈ కేసును చేధించారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios