నా కూతురినే కొడతావా.. అల్లుడిపై యాసిడ్ పోసిన అత్త

mother in law acid attack on son in law
Highlights

కూతుర్ని కష్టపెడితే అల్లుడు అని కూడా చూడట్లేదు.. గట్టిగానే బదులు చెబుతున్నారు. ఇలాంటి సంఘటనే ఇప్పుడు విజయవాడలో చోటుచేసుకుంది.

ఒకప్పుడు కూతుర్ని అల్లుడు కొట్టినా, తిట్టినా.. పుట్టింటి వారు సర్దుకుపోమ్మని సలహా ఇచ్చేవారు. కూతుర్ని బుజ్జగించి మరీ మళ్లీ అత్తారింటికే పంపించేవారు. కానీ ప్రస్తుతం తల్లులు అలా ఉండట్లేదు. పూర్తిగా మారిపోయారు. కూతుర్ని కష్టపెడితే అల్లుడు అని కూడా చూడట్లేదు.. గట్టిగానే బదులు చెబుతున్నారు.
ఇలాంటి సంఘటనే ఇప్పుడు విజయవాడలో చోటుచేసుకుంది.

తన కూతురిని వేధిస్తున్నాడని సొంత అల్లుడిపైనే ఓ అత్త యాసిడ్ దాడి చేసిన ఘటన విజయవాడ నగర శివారులోని వాంబే కాలనీలో కలకలం రేపింది. కాలనీకి చెందిన మోహనాచారికి అదే ప్రాంతానికి చెందిన మహిళతొ పదేళ్ల క్రితం వివాహమైంది. మోహనాచారి ఇంటి ఖర్చుల కోసం భార్యకు డబ్బులు ఇవ్వకపోవడంతో వారిద్దరి మధ్యా తీవ్ర మనస్పర్థలు తలెత్తాయి. 

ఈ క్రమంలో తమ కుమార్తెపై చేయి చేసుకున్నాడనే ఆగ్రహంతో అల్లుడి ముఖంపై అత్త యాసిడ్‌తో దాడి చేసింది. తీవ్రగాయాల పాలైన బాధితుడిని పాయికాపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. అక్కడే చికిత్స పొందుతున్నాడు. నున్న గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

loader