నెల్లూరులో ఓ తల్లి అత్యంత కిరాతకంగా వ్యవహరించింది. చదువుకు అడ్డుగా ఉందని యేడాదిన్నర చిన్నారిని కాల్వలో పడేసి హత్య చేసింది. 

నెల్లూరు : ఇంట్లో ఉయ్యాల నుంచి మాయమై చెరువులో శవంగా తేలిన ఏడాదిన్నర చిన్నారి మృతి కేసులో వెలుగు చూసిన వాస్తవాలు ప్రతి ఒక్కరిని కదిలించేలా ఉన్నాయి. ఉయ్యాలలో పడుకున్న చిన్నారిని నీళ్లలో వేయడమే కాకుండా పైకి తేలకుండా ఉండేందుకు కాళ్ళకి రాళ్లు కట్టి మరీ వేశారు. ఇంత దారుణంగా వ్యవహరించింది ఎవరో తెలిస్తే.. ఇంకా తట్టుకోలేము. నెల్లూరులో అదృశ్యమైన పాప మర్డర్ మిస్టరీని పోలీసులు చేదించారు. ఆ చిన్నారిని తల్లి అతి దారుణంగా చంపేసిందని తేలింది. తన కెరీర్ కి అడ్డు వస్తుందని తల్లి అనూషనే చిన్నారిని చంపేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. 

అనూష తల్లి గారి ఇంట్లో ఉంటూ ఎంసీఏ చేస్తుంది. మరోవైపు కుటుంబ పోషణ కోసం పార్ట్ టైం జాబ్ కూడా చేస్తుంది. ఆమెకు ఏడాదిన్నర వయసున్న అనూష అనే కూతురుతో పాటు మరో పెద్ద కూతురు కూడా ఉంది. ఈ క్రమంలోనే ముద్దులొలికే హారిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులతోపాటు చుట్టుపక్కల వారు కూడా కంగారుపడ్డారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఆ ఏరియాలో సీసీ కెమెరాలు లేకపోవడంతో ఎలాంటి ఆధారాలు దొరకలేదు.

కారులో సజీవదహనమైన సాఫ్ట్ వేర్ ఉద్యోగి నాగరాజు.. హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి..

దీంతో వారు మరో కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. అంత అర్థ రాత్రిపూట ఇంట్లోకి ప్రవేశించి చిన్నారిని ఎత్తుకెళ్లడానికి ఎవరు సాహసిస్తారు? ఇది తెలిసిన వాళ్ళ పనా? ఇంకేదైనా ఈ కేసులో ఉందా అని ఆరా తీశారు. ఈ క్రమంలోనే సర్వేపల్లి కాలనీలోని ఓ కాలువలో చిన్నారి హారిక మృతదేహం దొరికింది. ఆ మృతదేహాన్ని చూసిన ప్రతి ఒక్కరు కంటనీరు పెట్టారు. ముక్కు పచ్చలారని ఆ చిన్నారి కాళ్లకు రాళ్లు కట్టి మరీ కర్కశంగా కాలువలో పడేశారు ఆ కిరాతకులు. 

మృతదేహం దొరికిన తర్వాత నిందితుడిని పట్టుకోవడం పెద్దగా కష్టం కష్టం కాలేదు. ప్రాథమిక విచారణలో తల్లే ఆ చిన్నారిని అత్యంత దారుణంగా హతమార్చినట్లు తేలింది. తన కెరీర్ కి అడ్డు వస్తుందని బిడ్డని చంపేసి కిడ్నాప్ డ్రామాకు తెరలేపింది. చీమకుట్టి చిన్నారి ఏడిస్తేనే తట్టుకోలేని తల్లి మనసు.. అంత కర్కశంగా ఎలా మారిందనేది ఎవరికి అర్థం కాని విషయం. చిన్నారికి కాసేపు ఊపిరి ఆడకపోతేనే తల్లి ప్రాణాలు నిలిచిపోతాయి. అలాంటిది.. కాళ్లకు రాళ్లు కట్టి మరీ పైకి తేలకుండా నీళ్లలో పడేసిందంటే ఆమె ఎంత కఠినాత్మురాలో అర్థం చేసుకోవచ్చు అని స్థానికులు దుమ్మెత్తి పోస్తున్నారు. విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు తల్లిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.