వివాహేతర సంబంధం ఆ తల్లిలోని విచక్షణను చంపేసింది. కన్నకూతురు అన్న కారుణ్యాన్ని కాలరాసింది. అడ్డుగా ఉందని ప్రియునితో కలిసి ఏకంగా గొంతుకు చున్నీ బిగించి మరీ చంపేసింది. శవాన్ని బావిలో పడేసి.. దారుణమైన నాటకానికి తెరతీసింది.. 

బద్వేలు : మాతృత్వాన్ని పంచాల్సిన ఆతల్లి కన్నతల్లి రాక్షసత్వాన్ని ప్రదర్శించింది. గోరుముద్దలు తినిపించిన చేతులతోనే దారుణానికి ఒడిగట్టింది. extramarital affairకి అడ్డు వస్తుందని.. కన్నకూతురినే కడతేర్చింది. కనిపెంచిన పేగు బంధాన్ని కామవాంఛతో కాలరాసింది. కన్న బిడ్డను కర్కశంగా murder చేసి ..బావిలో పడేసి... ఎటో వెళ్ళిపోయింది అని అందరిని నమ్మించింది. ఈ దారుణం Badvel మండలం లక్ష్మీ పాలెంలో చోటుచేసుకుంది. రామచంద్ర ఎస్ఐ వెంకటరమణ, సిబ్బంది సహకారంతో హత్య కేసు mystreryని ఛేదించారు. ఆదివారం బద్వేలు పోలీసు సర్కిల్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు…

లక్ష్మీ పాలెం గ్రామానికి చెందిన రమణమ్మ సమీప బంధువు శీనయ్యతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీరిద్దరు ఏకాంతంగా ఉండటం కుమార్తె వెంకట సుజాత కంటపడింది. తల్లి ప్రవర్తనపై ఆగ్రహించి పద్ధతి మార్చుకోమని హెచ్చరించింది. అప్పటినుంచి కొన్నాళ్ళు దూరంగా ఉన్న రమణమ్మ, శీనయ్య ఆ తర్వాత వెంకటసుజాత తమ ఏకాంతానికి అడ్డుగా నిలుస్తుందని.. ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. నిరుడు అక్టోబర్ 16న వెంకట సుజాత (17) ఇంట్లో భోజనం చేసి నిద్రిస్తుండగా.. అదే అదనుగా భావించిన తల్లి పథకం ప్రకారం విషయాన్ని శీనయ్యకు చేరవేసింది.

శీనయ్య మరో వ్యక్తి కొండయ్యతో కలిసి రమణమ్మ ఇంటికి వచ్చాడు. మంచంపై పడుకొని ఉన్న వెంకటసుజాత మెడకు చున్నీ బిగించి హత్య చేశారు. ఆ తరువాత మృతదేహాన్ని ఆటోలో ఊరి చివర ఉన్న ఒక బావిలో పడవేశారు. హత్య జరిగిన తరువాత రమణమ్మ తన కుమార్తె ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని... అమాయకంగా ఇరుగు పొరుగు వారిని నమ్మించింది. ఏమీ తెలియనట్టు సమీప ప్రాంతాల్లో వెతికించింది. భర్త వెంకటయ్య మద్యానికి బానిస కావడంతో ఇవేమీ పట్టించుకోలేదు.

ఇంటర్ మొదటి సంవత్సరం వరకు చదివి కుటుంబ సహకారం లేక వెంకట సుజాత చదువు ఆపేసింది. ఆమె మానసిక స్థితి బాగా లేదని, అందుకే ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని తల్లి అందరికీ చెప్పింది. రెండు రోజుల తర్వాత మృతదేహం బావిలో కనిపించడంతో... స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. శవపరీక్ష నివేదిక ఆధారంగా సీఐ రామచంద్ర, ఎస్సై వెంకటరమణ ముమ్మర దర్యాప్తు చేశారు. 

తల్లి రమణమ్మ తీరు అనుమానాస్పదంగా ఉండటం... పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో.. ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉండడంతో శీనయ్య, కొండయ్యలతో కలిసి తానే కూతురిని హత్య చేసి బావిలో పడేసినట్లు ఒప్పుకోంది. ఈ మేరకు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ చెప్పారు.