కారణమిదే: మృతదేహంతో మూడు రోజులుగా తల్లి, కొడుకు

Mother and Son living with dead body from three days in west godavari district
Highlights

బతికొస్తోందని శవం వద్దే ఎదురుచూపులు


ఏలూరు: మృతదేహంతో తల్లి, కొడుకులు మూడు రోజుల పాటు ఒకే ఇంట్లో ఉన్నారు. ఆ ఫ్లాట్ నుండి దుర్వాసన వస్తున్న విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారాన్ని ఇచ్చారు. ఈ సమాచారం మేరకు పోలీసులు  ఆ ఫ్లాట్ లో వెళ్ళి చూస్తే అసలు విషయం వెలుగు చూసింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకొంది.

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని మేఘనా టవర్స్ అపార్ట్‌మెంట్ లో  మంజులాదేవి, ఆమె కొడుకు రవిచంద్రఫణి, ఆమె కూతురు అరుణజ్యోతి నివసిస్తున్నారు. ఈ ముగ్గురికి మతిస్థిమితం సరిగా లేదని స్థానికులు చెబుతున్నారు.  అరుణజ్యోతి అనారోగ్యానికి గురై ఇటీవల  మరణించింది.  ఆదివారం నాడు ఫ్లాట్ నుండి దుర్వాసన రావవడంతో  స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాుద మేరకు పోలీసులు ఫ్లాట్ తలుపులు తెరిచి చూశారు. అయితే అప్పటికే అరుణజ్యోతి మరణించి మూడు రోజులు కావస్తోంది. అందుకే ఫ్లాట్ నుండి దుర్వాసన వస్తోందని ఆమె పోలీసులు చెప్పారు.

అరుణజ్యోతి ఇంకా బతికే ఉందని ఆమెను తీసుకెళ్ళడానికి వీల్లేదని  ఆమె తల్లి మంజులాదేవి, సోదరుడు రవిచంద్రఫణి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వారిద్దరికి నచ్చజెప్పి ప్లాట్‌లో తాళ్ళపూడి అరుణజ్యోతి మృతదేహం మంచంపై ఉంది. ఆమె మరణించి  సుమారు మూడు రోజులు అయి ఉంటుందని పోలీసులు తెలిపారు. అరుణజ్యోతి ఇంకా బతికే ఉందని, ఆమెను తీసుకెళ్లడానికి వీలులేదని ఆమె తల్లి మంజులాదేవి, సోదరుడు రవిచంద్రఫణి పోలీసులను అడ్డగించారు. అరుణజ్యోతి మృతదేహం నుంచి దుర్వాసన వస్తున్నా గుర్తించలేని స్థితిలో వారు ఉన్నారు. చివరకు పోలీసులు వారికి నచ్చజెప్పి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. వీరు బంధువులతో విభేదించి దూరంగా ఉంటున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే వీరి మానసికస్థితి సరిగా లేదని చెబుతున్నారు. ఎస్సై విష్ణువర్దన్‌ కేసు నమోదు చేశారు.

loader