ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో మంకీపాక్స్ కలకలం రేపింది. విశాఖలో మంకీపాక్స్ అనుమానిత కేసు నమోదైంది. ఓ ప్రైవేట్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ స్టూడెంట్‌కు మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్టుగా గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో మంకీపాక్స్ కలకలం రేపింది. విశాఖలో మంకీపాక్స్ అనుమానిత కేసు నమోదైంది. ఓ ప్రైవేట్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ స్టూడెంట్‌కు మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో జిల్లా వైద్య యంత్రాంగం అప్రమత్తమైంది. ఆ వైద్య విద్యార్థిని ఐసోలేషన్‌లో ఉంచారు. అయితే నమునాలు సేకరించి పరీక్షలకు పంపేందుకు వైద్య బృందం వెళ్లగా.. అతడు ఐసోలేషన్ గదిలో కనిపించలేదు. అయితే ఆ వైద్య విద్యార్థి ఎక్కడికి వెళ్లారో తెలుసుకునేందుకు అధికారులు గాలింపు చేపట్టారు.
యువకుడికి కేవలం లక్షణాలే ఉన్నాయని.. మంకీపాక్స్ నిర్దాణ కాలేదని.. అయితే తాము అప్రమత్తంగా ఉన్నామని జిల్లా వైద్యశాఖ అధికారులు చెప్పారు. మరోవైపు అధికారులు ఆ విద్యార్థి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు శనివారం హైదరాబాద్ నుంచి విశాఖ చేరుకునే అవకాశం ఉంది. మరోవైపు ఇటీవల కాలంలో విద్యార్థిని కలిసినవారి వివరాలను సేకరిస్తున్నారు. ఆ విద్యార్థి కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌తో పాటు మరికొన్ని ప్రాంతాలకు వెళ్లి వచ్చినట్టుగా తెలుస్తోంది.
ఇక, గుంటూరులో ఇటీవల మంకీపాక్స్ అనుమానిత కేసు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఒంటిపై దద్దుర్లతో ఎనిమిదేళ్ల బాలుడు గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో చేరాడు. ఒంటిపై దద్దుర్లు ఉండడంతో మంకీ పాక్స్‌గా వైద్యులు అనుమానించారు. వెంటనే శాంపిల్స్‌ను సేకరించి పరీక్షల నిమిత్తం పంపారు. అయితే ఆ పరీక్షల్లో మంకీ పాక్స్ నెగిటివ్‌గా తేలింది.
