విజయవాడలో చిన్నారికి దద్దుర్లు: మంకీపాక్స్ అనుమానంతో ఐసోలేషన్ లో చికిత్స

విజయవాడలో రెండేళ్ల చిన్నారికి మంకీపాక్స్ లక్షణాలు కన్పించాయి. దీంతో చిన్నారి కుటుంబాన్ని ఐసోలేషన్ కు తరలించారు. చిన్నారికి విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

Monkey Pox Symptoms  Found Two year Old Child in Vijayawada

విజయవాడ: Vijayawada లో రెండేళ్ల చిన్నారికి Monkey Pox లక్షణాలు కన్పించాయి. దీంతో చిన్నారి కటుంబాన్ని ఐసోలేషన్ లో ఉంచారు అధికారులు.  ఇటీవలనే Dubai నుండి చిన్నారి కుటుంబం విజయవాడకు వచ్చింది. చిన్నారి ఒంటిపై దద్దుర్లు కావడంతో ఆసుపత్రికి తరలించారు. చిన్నారి నుండి సేకరించిన శాంపిల్స్ ను అధికారులు పుణెలోని ల్యాబ్ కు పంపారు. చిన్నారికి మంకీపాక్స్ సోకిందా లేదా అనే విషయం ల్యాబ్ రిపోర్టు తర్వాతే నిర్ధారణ కానుంది.  ఒంటిపై దద్దుర్లు రావడంతో  వైద్యశాఖాధికారులు ముందు జాగ్రత్తగా ఆ కుటుంబాన్ని ఐసోలేషన్ కు తరలించారు. విజయవాడ పాత ఆసుపత్రిలో చిన్నారికి  చికిత్స అందిస్తున్నారు.

ప్రపంచంలో మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి చెందుతుంది. దేశంలోని కేరళ రాష్ట్రంలో తొలి మంకీ పాక్స్ కేసు నమోదైంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే పలు రాష్ట్రాలను అలెర్ట్ చేసింది.జ్వరం, దగ్గు, శరీరంపై దద్దుర్లు రావడం ఈ వ్యాధి లక్షణాలుగా చెబుతున్నారు.  మంకీపాక్స్ సోకిన వారి నుండి ఇతరులకు కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందనుంది. మంకీపాక్స్ వ్యాధి సోకిన వారిని ఎవరెవరు కలిశారనే విషయాలపై కూడా వైద్య ఆరోగ్య శాఖాధికారులు వివరాలు సేకరించనున్నారు. కరోనా వైరస్  వ్యాప్తి చెందడం ముగియకముందే మంకీపాక్స్ దేశంలో కలకలం రేపుతుంది. విదేశాల నుండి వచ్చిన ప్రయాణీకులను వైద్యశాఖాధికారులు పరీక్షించనున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios