Asianet News TeluguAsianet News Telugu

మొహర్రం వేడుకల్లో అపశృతి... భగభగ మండుతున్న మంటల్లో దూకి వ్యక్తి మృతి (వీడియో)

మొహర్రం వేడుకల్లో పాల్గొన్న ఓ వ్యక్తి హటాత్తుగా పీర్ల గుండంలో దూకి మృతిచెందిన విషాద ఘటన కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. 

moharram celebrations.... man died in kurnool district
Author
Kurnool, First Published Aug 20, 2021, 9:31 AM IST

కర్నూల్: ఎంతో భక్తిశ్రద్దలతో హిందూ-ముస్లీంలు కలిసి జరుపుకునే పండగ మొహర్రం. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ మొహర్రం వేడుకలో అపశృతి చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే భగభగ మండుతున్న పీర్ల గుండంలో దూకి ఓ వ్యక్తి కాలిబూడిదైన దుర్ఘటన కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది.  

వివరాల్లోకి వెళితే... కర్నూల్ జిల్లా అవుకు రూరల్ మండలంలోని సుంకేసుల గ్రామంలో గురువారం రాత్రి మొహర్రం ఉత్సవాలు జరిగాయి. ఈ మొహర్రం వేడుకలను తిలకించేందుకు కాశీపురం గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్య (55) అనే వ్యక్తి సుంకేసులకు వచ్చాడు. అయితే హటాత్తుగా ఏమయ్యిందో తెలీదు కానీ స్థానికులు అందరూ చూస్తుండగానే ఉన్నట్టుండి ఒక్కసారిగా అతడు దట్టంగా మండుతున్న పీర్ల గుండంలో దూకాడు. ో

వీడియో

అక్కడే వున్నవారు అతడిని కాపాడే ప్రయత్నం చేసినా కుదరలేదు. అతడు మంటల్లోకి దూకగానే శరీరమంతా మంటలు అంటుకున్నాయి. అక్కడున్నవారు వెంటనే స్పందించి బయటకు తీసేలోపే పూర్తిగా  కాలిపోయాడు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పూర్తిగి కాలిపోయిన స్థితిలోవున్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios