Asianet News TeluguAsianet News Telugu

హెరిటేజ్ ఫుడ్స్ నాది.. చంద్రబాబుపై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్

హెరిటేజ్ ఫుడ్స్ అనగానే అందరికీ ఏపీ సీఎం చంద్రబాబు గుర్తుకు వస్తారు. అది ఆయన కంపెనీ అన్న విషయం అందిరీకీ తెలిసిందే. అయితే.. నిజానికి ఆ కంపెనీ చంద్రబాబుది కాదని.. తనదని సినీ నటుడు మోహన్ బాబు సంచలన కామెంట్స్ చేశారు.

mohan babu says, chandrababu chested him over heritage foods company
Author
Hyderabad, First Published Apr 3, 2019, 1:47 PM IST

హెరిటేజ్ ఫుడ్స్ అనగానే అందరికీ ఏపీ సీఎం చంద్రబాబు గుర్తుకు వస్తారు. అది ఆయన కంపెనీ అన్న విషయం అందిరీకీ తెలిసిందే. అయితే.. నిజానికి ఆ కంపెనీ చంద్రబాబుది కాదని.. తనదని సినీ నటుడు మోహన్ బాబు సంచలన కామెంట్స్ చేశారు.

హెరిటేజ్‌ ఫుడ్స్‌ కంపెనీ తనదని మోహన్ బాబు తెతలిపారు. చంద్రబాబు, తాను, దాగా అనే మరో స్నేహితుడు కలిసి హెరిటేజ్‌ ఫుడ్స్‌ను స్థాపించామన్నారు. తానున  ప్రధాన భాగస్వామిని అని అంటే తనది ఎక్కువ పెట్టుబడి. చంద్రబాబుది తక్కువ పెట్టుబడ అని దాగా అనే అయనది మరికొంత తక్కువ పెట్టుబడి అని మోహన్ బాబు తెలిపారు.

‘‘స్థాపించిన కొన్నాళ్ల తరువాత చంద్రబాబు కొన్ని బ్లాంక్‌ పేపర్లు పంపించి సంతకాలు పెట్టమన్నారు. బ్లాంక్‌ పేపర్ల మీద సంతకాలు ఎందుకని అడిగితే ఏదో చెప్పారు. అప్పట్లో నేను సినిమా హీరోగా అగ్రస్థానంలో ఉన్నాను. కెరీర్‌ పీక్స్‌లో ఉండటంతో చాలా బిజీగా ఉన్నాను. అప్పట్లో నాకు ఇన్ని విషయాలు కూడా తెలీవు. స్నేహితుడు అని నమ్మి చంద్రబాబు చెప్పినట్లు బ్లాంక్‌ పేపర్ల మీద సంతకాలు చేశాను. తరువాత మరికొన్ని పేపర్ల మీద కూడా సంతకాలు తీసుకున్నారు.

తరువాత కొన్నేళ్లకు హెరిటేజ్‌ సంస్థతో నాకు సంబంధం లేదని చెప్పడంతో ఒక్కసారి షాక్‌ తిన్నాను. కోర్టుకు వెళ్లాను. కేసు చాలా కాలం సాగింది. కానీ చంద్రబాబు పరపతి ఉన్నవాడు. ఆయనతో మనం తట్టుకోలేం అని కుటుంబ సభ్యులు, కొందరు స్నేహితులు చెబితే ఆ కేసు వదిలేశాను. ఓ సినిమా తీశాం. ఫెయిల్‌ అయ్యింది అనుకుని సరిపెట్టుకున్నాను. నా తరువాత దాగానూ అలాగే మోసం చేసి బయటకు పంపేశారు.’’ అని మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios