మొబైల్ ఫోన్ కోసం ఓ బాలుడి ప్రాణం తీశారు. ఫోన్ దొంగలించాడనే కారణంతో.. చిన్నపిల్లాడనే కనికరం కూడా లేకుండా కొట్టారు. కాగా.. ఆ దెబ్బలు తట్టుకోలేక బాలుడు ప్రాణాలు వదిలాడు. ఈ విషాదకర సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన ఓ బాలుడిని చితకబాదారు. మొబైల్ దొంగించాడంటూ ఇరు వర్గాలు కలిసి ఓ బాలుడిని చితకబాదారు. ఈ దాడిలో బాలుడు తీవ్ర గాయపడ్డాడు. స్పృహతప్పి నేలకొరిగాడు. అయితే బాలుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. ఈ ఘటనలో దాడికి పాల్పడిన ఇరు వర్గాలు రాజీ కుదుర్చుకుని పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఈ విషయంలో అందరికీ తెలియడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.