అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్  ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాన్ కవాతుకు బదులు కార్యకర్తలను తిత్లీ తుఫాన్ ప్రభావిత ప్రాంతావలకు పంపొచ్చు కదా అంటూ అని విమర్శించారు. 

తిత్లీ తుఫాన్ పై జనసేన, వైసీపీలు రాజకీయాలు చేస్తున్నాయని డొక్కా మండిపడ్డారు. తిత్లీ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు అండగా సీఎం చంద్రబాబు ఉంటే ప్రతిపక్షాలు మాత్రం రాజకీయాలు చేస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం మాని సీఎం చంద్రబాబుకు అండగా నిలవాలని డొక్కా హితవు పలికారు. మరోవైపు తిత్లీ తుఫాన్ బాధితులను కేంద్రప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రూ.1200 కోట్లు విడుదల చేయాలని కోరారు. హుద్‌ హుద్‌ తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు వెయ్యికోట్ల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారని అయితే కేవలం రూ.600 కోట్లు మాత్రమే ఇచ్చారని గుర్తు చేశారు.