కొంగ జపం చేసినా కూడా వైసీపీ అధినేత జగన్ సీఎం కాలేడని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అబిప్రాయపడ్డారు. జగన్ ఇస్తున్న హామీలను ప్రజలు నమ్మరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శనివారం రాష్ట్ర రాజధాని అమరావతి లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఇరుపార్టీల మేనిఫెస్టోలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. కుర్చీపై కలలుకనడం తప్ప  జగన్ ప్రజలకు ఏమీ చేయలేదని విమర్శించారు. పెన్షన్ పెంపును వైసీపీ రాజకీయం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. అవినీతి కేసులో జైలుకెళ్లిన జగన్‌ కి చంద్రబాబు ని విమర్శించే అర్హత లేదన్నారు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమన్నారు. ఈ ఎన్నికల అనంతరం జగన్‌ కాషాయ వస్త్రాలు వేసుకుని కాశీయాత్ర చేయడం ఖాయమని అన్నారు. ముక్కుమూసుకుని కొంగజపం చేసినా జగన్ సీఎం కాలేడని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు.