‘కన్నా విషయంలో అదే జరిగితే.. గుండు గీయించుకుంటా’

mlc budha venkanna challenge to bjp leader kanna lakshmi narayana
Highlights

బుద్ధా వెంకన్న సవాల్

బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణకు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సవాల్ విసిరారు. కన్నా లక్ష్మీనారాయణకు  వచ్చే ఎన్నికల్లో డిపాజిట్   దక్కితే తాను గుండుగీయించుకుంటానని, రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా కన్నాపై పోటీకి తాను సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. కన్నా తన అక్రమాస్తులను కాపాడుకోవడానికే బీజేపీలోకి వెళ్లారని ఆరోపించారు. విభజన హామీలన్ని నేరవేర్చిన తర్వాతే బీజేపీ నేతలు మాట్లాడాలన్నారు. విజయవాడలో బీజేపీనేతల ధర్నా అధర్మమని, అందుకే తాము కూడా నిరసన తెలిపామని బుద్దా వెంకన్న చెప్పారు.
 
ప్రధాని నరేంద్రమోదీపై టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ ఆందోళన బాట పట్టింది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం విజయవాడ ధర్నాచౌక్‌లో బీజేపీ మహాధర్నా చేపట్టింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, గోకరాజు గంగరాజు, మాణిక్యాలరావు ఈ ధర్నాలో పాల్గొన్నారు.

loader