Asianet News TeluguAsianet News Telugu

51మంది టిడిపి నాయకులు జైలుకు...: టిడిపి ఎమ్మెల్సీ అర్జునుడు

వైసీపీ ప్రభుత్వ ఏడాది పాలన చూస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర పరిపాలనపై అవగాహన లేదని ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చారని టిడిపి ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అన్నారు. 

MLC Batchula Arjunudu Comments on TDP Leaders Arrests
Author
Guntur, First Published Jun 25, 2020, 9:32 PM IST

గుంటూరు: వైసీపీ ప్రభుత్వ ఏడాది పాలన చూస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర పరిపాలనపై అవగాహన లేదని ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చారని టిడిపి ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అన్నారు.  రాష్ట్రాన్ని అరాచకత్వంతో, భయభ్రాంతులకు గురిచేసి పాలన చేయాలనుకుంటున్నారని   ఆరోపించారు. ఇప్పటివరకు 51 మంది తెదేపా నాయకులను జైలు పాలు చేశారని...340మందిపై అక్రమ కేసులు బనాయించారని అన్నారు. 

''ప్రజా సమస్యలను విన్నవించడానికిగాను నిర్మించిన ప్రజావేదికను కూల్చడంతో పాలన ప్రారంభించారు. కరకట్ట ప్రాంతంలో పెద్దేత్తున అవినీతి కారణంగా కట్టడాలు నెలకొన్నాయని ఆరోపించారు. ఆనాడు వైఎస్ అనుమతితోనే కరకట్ట వద్ద నిర్మాణాలు చోటు చేసుకున్నాయి. అక్రమకట్టడాలు అవసరానికున్నాయా లేదో మానవత్వంతో, విచక్షతతో ఆలోచించి నిర్ణయాలు చేయాలి. మా  నేత చంద్రబాబు ఇంటికి వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు'' అని తెలిపారు. 

'' ప్రజావేదిక కూల్చి నేటికి ఏడాది అయిందని ప్రజలకు గుర్తు చేయడానికి తెదేపా నేతలు వెళితే దౌర్జన్యంగా అరెస్ట్ చేశారు. రెండున్నర గంటల పాటు మంగళగిరి పోలిస్ స్టేషన్ లో పెట్టడంలో ప్రభుత్వ ఆలోచన, విధానం ఏమిటి? ప్రజావేదిక అక్రమమని గందర గోళం సృష్టించారు. అయితే కరకట్టపై నిర్మించిన ఏ కట్టడాన్ని ఇప్పటివరకు కదిలించలేక పోయారు. గోకరాజు గంగరాజు భవనాన్ని తాకలేని అసమర్థ ప్రభుత్వమిది. రాక్షసత్వంగా ప్రజావేదిక ను కూల్చి రూ.11 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారు'' అని అన్నారు. 

''చంద్రబాబును బాధ పెట్టడానికి  కూల్చిన భాగాలను తొలగించకుండా ఉండటాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారు. గత తెదేపా హయాంలో అమలు చేసిన 34 సంక్షేమ పథకాలను ఏడాది కాలంలో వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. సొంతడబ్బా కొట్టే కార్యక్రమాలకు డబ్బులు పంచుతున్నారు. రూ. 5 ,10 వేలిచ్చి సంక్షేమ పథకాలంటే ప్రభుత్వ ఉద్దేశ్యం అర్థం కావడంలేదు.   కుటుంబాన్ని ఆర్థికంగా సాయం అందించి స్వశక్తిపై నిలబడేట్లు చేయడం సంక్షేమం . బీసీ,ఏసీ,ఎస్టీ ,మైనారిటీ,బ్రాహ్మణ వర్గాలకు తెదేపా రూ. 50-60 వేల కోట్లు ఖర్చు చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం రూ.42 వేలతో 20 లక్షలమందికి మాత్రమే సంక్షేమ జరగడంపై జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాలి'' అని సూచించారు. 

read more   టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డికి కరోనా... క్లారిటీ ఇచ్చిన ఏపి వైద్యారోగ్య శాఖ

''తెలుగు భాషను ప్రాథమిక విద్యలో పూర్తిగా తోలగించడం కరెక్ట్ కాదు. తెలుగు భాష బిల్లును వ్యతిరేకించి నందుకు ఏకంగా మండలినే రద్దు చేయాలనుకున్నారు. యథారాజా తదా ప్రజా అన్నట్లు వైసీపీ నేతలంతా మాట్లాడేభాష విధానం అసహ్యం వేస్తోంది. రాష్ట్రంలో లాండ్, మైన్,వైన్,ఇసుక దోపిడీ లే. వైసీపీపాలనలో దేంట్లో కుంభకోణాలు లేవు. 20 లక్ష కూబిక్కు మీటర్ల ఇసుక  మాయమైనదని స్వయంగా మంత్రి చెబితే పరిశీలన, పర్యవేక్షణ  చేయాల్సిన బాధ్యత  జగన్ పై లేదా?'' అని అడిగారు. 

''రాష్ట్రంలో వ్యవస్థలన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. గతంలో పోలీసు వ్యవస్థకు ఉన్న మంచి పేరు గౌరవం నేడు కోల్పోయారు. ఏపీలో పోలీస్ ప్రభుత్వం నడుస్తోందని స్యయంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి  మాట్లాడితే ప్రభుత్వ పెద్దలు నోరెత్తే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి జగన్ కోర్టు బెయిల్ పై ఉన్నారు. అదే కోర్టు ఇచ్చిన ఆదేశాలను ముఖ్యమంత్రి ఎందుకు గౌరవించడం లేదు. కోర్టులంటే లెక్కలేదు'' అని మండిపడ్డారు. 

''తెదేపా నాయకులను అణచి వేయడమే జగన్ లక్ష్యం.  జగన్ అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఏడాది కాలంలో తెదేపా నాయకులపై 800దాడులు జరిగాయి. మహిళలు సుమారు 4987 ఫిర్యాదులు చేస్తే పోలిస్ స్టేషన్లలో కేసు నమోదు చేయలేదు. ఏడాది కాలంలో 368 మందిపై అత్యాచారాలు జరిగాయి.  51 మంది తెదేపా నాయకులను జైలు పాలు చేశారు. 340మందిపై అక్రమ కేసులు బనాయించారు. బీసీలు,ఎస్సీలు,ఎస్టీలు మైనారిటీ వర్గాలపైనే 286 కేసులు పెట్టారు'' అని వెల్లడించారు. 

''వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా వైసీపీ ప్రభుత్వానికి వినాశ కాలం దగ్గర పడింది. ప్రజాస్వామ్యమంటే వైసీపీ ప్రభుత్వానికి లెక్కలేదా? ఒక్క చాన్స్ అని అధికారంలోకి వచ్చి ఇంత అరాచకమా?  ఆస్పత్రిలోనే అచ్చన్నాయుడుకు చికిత్స చేస్తూనే విచారణ చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశాలను అధికారులు ధిక్కరిస్తే ఎలా?  అధికార పార్టీ చెప్పిందని దుర్మార్గంగా డిశ్చార్జీ చేస్తారా? అన్ని అధికార యంత్రాంగాలను పనికి మాలిన యంత్రంగాలుగా మార్చారు'' అని మండిపడ్డారు. 

''ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తెదేపా ప్రజాక్షేత్రంలో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల పక్షాన పోరాడుతుంది. అసమర్థ ప్రభుత్వ విధానాలను, అరాచాకత్వాన్ని ఎండగడుతుంది. మండలిలో 54 బిల్లులకు తెదేపా ఆమోదం తెలిపింది. తెలుగు భాషను ప్రవేశ పెట్టడం,రాజధాని అభివృద్ధి సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల ఏర్పాటు బిల్లులను వ్యతిరేకించింది. మండలిలో జరిగిన సంఘటనపై ఫుటేజీని బయట పెట్టాలని చాలెంజ్ విసురుతున్నాం'' అన్నారు. 

''పోలిస్ వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలి. పోలిస్ బాస్ కోర్టుకు మూడు సార్లు వెళ్ళారు.  పోలిస్ వ్యవస్థ పని తీరును కోర్టు ప్రశ్నించింది.  జడ్జి , న్యాయస్థానాల తీర్పులతో ప్రజాస్వామ్యం మనగలుగుతోంది. అధికారపక్షానికి అధికార యంత్రాంగం తలొగ్గి పని చేయడం ఎంతో కాలం  కొనసాగదు . పోలీస్ యంత్రాంగం ఇకనైనా కళ్ళు తెరవాలి'' అని అర్జునుడు హెచ్చరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios