Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. రిమాండ్ పొడిగించిన న్యాయస్థానం

డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు న్యాయస్థానం షాకిచ్చింది. ఆయన రిమాండ్‌ను డిసెంబర్ 2 వరకు పొడిగించింది. డిఫాల్ట్ బెయిల్ మంజూరు కోసం డిసెంబర్ 12న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. 

mlc anantha babu remand extended
Author
First Published Nov 18, 2022, 3:07 PM IST

డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు డిసెంబర్ 2 వరకు రిమాండ్ పొడిగించించి న్యాయస్థానం. డ్రైవర్ హత్య కేసులో మే 23 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో వున్నారు అనంతబాబు. డిఫాల్ట్ బెయిల్ మంజూరు కోసం డిసెంబర్ 12న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఏపీ హైకోర్టు బెయిల్ పిటిషన్ కొట్టివేయడంతో సుప్రీంకోర్ట్‌ను ఆశ్రయించారు అనంతబాబు. 

కాగా.. ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. డీఫాల్ట్ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు అనంతబాబు. ఈ మేరకు కేవిఎట్ పిటిషన్ దాఖలు చేశారు అనంతబాబు కుటుంబ సభ్యులు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. తదుపరి విచారణ డిసెంబర్ 12కు వాయిదా వేసింది సుప్రీంకోర్ట్. ఇప్పటికే అనంతబాబు బెయిల్ పిటిషన్ కొట్టివేశాయి రాజమండ్రిలోని ఎస్సీ ఎస్టీ కోర్టు, ఏపీ హైకోర్ట్. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు అనంతబాబు కుటుంబ సభ్యులు.

అంతకుముందు సెప్టెంబర్ 26న జరిగిన విచారణ సందర్భంగా అనంతబాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అనంతబాబు దాఖలు చేసిన బెయిల్ పటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. తన మాజీ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి అనంతబాబు మే 23 నుంచి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉంటున్నారు. అయితే బెయిల్ కోసం అనంతబాబు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఏపీ హైకోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది.

ALso REad:ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ..

డ్రైవర్ హత్యకేసులో పోలీసులు 90 రోజుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేయనందున అనంతబాబుకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు లాయర్ కోర్టును కోరారు. అయితే అనంతబాబు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఇదిలా ఉంటే.. హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌ను ఇటీవల రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు పొడిగించింది. అనంతబాబు రిమాండ్‌ను అక్టోబర్ 7 వరకు పొడగిస్తూ ఉత్తర్వుల జారీచేసింది. 

ఇకపోతే.. ఆగస్ట్ నెలలో అనంతబాబు తల్లి మంగారత్నం మృతి చెందడంతో ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. దీంతో అనంతబాబుకు మూడు రోజుల పాటు షరత్‌లతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. రూ. 25 వేల పూచికత్తుపై బెయిల్‌ మంజూరు చేసిన కోర్టు.. మూడు రోజులు అతడి స్వగ్రామం ఎల్లవరం దాటి బయటకు రావద్దని ఆదేశించింది.

Follow Us:
Download App:
  • android
  • ios