నంద్యాల వన్‌టౌన్ పోలీసులతో వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. ప్ర‌జ‌లు కు డ‌బ్బులు పంచుతు పోలీసుల‌కు అడ్డంగా దొరికిపోయారు. అక్క‌డ ఎక్కువ‌, ఇక్క‌డ త‌క్కువ ఎందుకు ఇస్తున్నార‌ని యువ‌కుల‌ను నిల‌దీశారు ప్రజలు. విషయం తెలసుకున్న పోలీసులు డబ్బు పంచుతున్న యువకులను అదుపులోకి తీసుకున్నారు.

నంద్యాల వన్‌టౌన్ పోలీసులతో వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. శుక్ర‌వారం నంద్యాల ఉప ఉన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచుతూ పోలీసులకు 28మంది పట్టుబడ్డారు. అయితే... అందులో వైసీపి కార్య‌క‌ర్త‌ను అన‌వ‌స‌రంగా ప‌ట్టుకుని పోలీసులు స్టేష‌న్ కి త‌ర‌లించార‌ని ఎమ్మెల్యే పోలీసుల‌తో గొడ‌వ‌కు దిగారు ఎమ్మెల్యే.


నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో కొంద‌రు ప్ర‌జ‌లు కు డ‌బ్బులు పంచుతు పోలీసుల‌కు అడ్డంగా దొరికిపోయారు. కొంద‌రు యువ‌కులు ఒక ప్రాంతంలో రూ. 5000, మ‌రో ప్రాంతంలో రూ. 2000 డబ్బును పంచారు. అయితే ఇది గ‌మ‌నించిన కొంద‌రు ఆ యువ‌కుల‌ను నిల‌దీశారు, అక్క‌డ ఎక్కువ‌, ఇక్క‌డ త‌క్కువ ఎందుకు ఇస్తున్నార‌ని యువ‌కుల‌ను నిల‌దీశారు. చివ‌ర‌కు ఆ గొడ‌వ ప్ర‌జ‌ల‌కు, డ‌బ్బు పంచుతున్న‌ యువ‌కుల‌కు పెరిగింది. అయితే అక్క‌డ ఉన్న కొంద‌రు ప్ర‌జ‌లు పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసుల వ‌చ్చి డ‌బ్బు పంచుతున్న యువ‌కుల‌ను ప‌ట్టుకుని పోలీస్టేష‌న్ కి త‌ర‌లించారు. కాగా... మొత్తం రూ. 4.30లక్షలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలుపుతున్నారు. మొత్తం 28మందిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.


ఈ విష‌యం తెలుసుకున్న‌ వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని డబ్బుతో పట్టుబడినవారి గురించి ఆరా తీశారు. అనంతరం ఖర్చుల కోసం డబ్బులు దగ్గర పెట్టుకుంటే ఎలా అరెస్ట్‌ చేస్తారంటూ పోలీసులతో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. వారిలో నలుగురు మాత్రమే వైసీపీ కార్యకర్తలు ఉన్నారని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి పేర్కొంటున్నారు. ఖర్చుల నిమిత్తం వారు డబ్బులు ఉంచుకున్నారని, ఈ విషయాన్ని పోలీసులు గమనించాలని ఎమ్మెల్యే అన్నారు.