వైపీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరొందిన్న ఎమ్మెల్యే రోజా... ఈరోజు సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. చరిత్ర సృష్టించే సంఘటన తొమ్మిదేళ్ల క్రితం ఒకటి జరిగిందంటూ ఆమె ఫేస్ బుక్ లో పేర్కొన్నారు.

ఇంతకీ మ్యాటరేంటంటే... వైసీపీ నేడు పదో వసంతంలోకి అడుగుపెట్టింది. సరిగ్గా పదేళ్ల క్రితం ఇదే రోజున పార్టీని స్థాపించారు. జగన్.. పార్టీ ప్రకటించిన రోజుని ఈ సందర్భంగా ఆ పార్టీ నేత, నగరి ఎమ్మెల్యే రోజా గుర్తు చేసుకున్నారు. ఆ నాడు.. జగన్.. తూర్పుగోదావరి జిల్లా లోని జగ్గంపేటలో పార్టీ పేరును ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. రోజా ఓ వీడియో విడుదల చేశారు.

Also Read పదో వసంతంలోకి వైసీపీ.... సీఎం జగన్ ఎమోషనల్ ట్వీట్.

జగ్గంపేటలో వైఎస్ఆర్ విగ్రహం ముందు నిల్చొని జగన్ పార్టీ పేరును ప్రకటించారు. అంతేకాకుండా ఆయన ఆరోజు మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోని రోజా ఫేస్ బుక్ లో షేర్ చేశారు.

 

ఆ వీడియోలో జగన్ ఏ మాట్లాడారంటే... ‘‘ ఇడుపులపాయలో ప్రియతమ నేత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి పాదాల చెంతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మూడు రంగుల జెండా తన తల్లి విజయమ్మతో కలిసి ఆవిష్కరిస్తాను’’ అంటూ జగన్ ప్రకటించారు. ఆ వీడియోలొ జన సంద్రాన్ని చూస్తే... అప్పటికే జగన్ పై ప్రజలకు ఎంత అభిమానం ఉందో స్పష్టంగా  అర్థమౌతోంది. 

కాగా.. రోజా షేర్ చేసిన వీడియోని వైసీపీ కార్యకర్తలు, అభిమానులు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుండటం గమనార్హం. పార్టీ పదో వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా జగన్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.