కరోనా వైరస్ విజృంభణకు అడ్డు ఆపు లేకుండా పోతుంది తాజగా రోజా గన్ మ్యాన్ కి కరోనా సోకింది. రోజా గన్ మ్యాన్ కి కరోనా పాజిటివ్ అని తేలడంతో.... రోజాతో సహా అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. అందరికి ముందు జాగ్రత్తగా కరోనా టెస్టులు చేయనున్నారు. 

ఇకపోతే... నగరి ఎమ్మెల్యే రోజా మరో వివాదంలో చిక్కుకున్నారు. సొంత నియోజకవర్గంలో ఆమె మాస్క్ లేకుండా పర్యటించడం చర్చకు దారితీస్తోంది.వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి (జూలై 8)ని రైతు దినోత్సవంగా పాటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రైతులకు సంబంధించిన పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.

ఇందులోభాగంగా రోజా కూడా నగరిలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఇక్కడే ఆమె వివాదాల్లో చిక్కుకున్నారు.నగరి నియోజకవర్గంలో కరోనా కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ఇటీవల కరోనాతో మరణాలు కూడా సంభవించాయి. ఇలాంటి పరిస్థితిల్లో రోజా, తన చుట్టూ జనాలు ఉన్నప్పటికీ ఆమె మాస్క్ పెట్టుకోలేదు.

అంతేకాదు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదేపదే కరోనా నివారణ కోసం చర్యలు తీసుకోవాలని చెబుతున్నాయి. ఆమె మాత్రం ఆ నియమాలను పాటించడం లేదు.మాస్క్ లేకుండా.. భౌతిక దూరం పాటించకుండా పలు కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో రోజా తీరును పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆమె ఎమ్మెల్యేగా అందరికీ ఆదర్శంగా ఉండాలి.. కానీ ఆమె నియమాలు పాటించపోతే ఎలా స్థానికులు నిలదీస్తున్నారు.

ఇటీవల కరోనా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ ఆమె పర్యటించారు. ఆ సమయంలో తనపై పూల వర్షం కూడా కురిసింది. ఈ విషయంలోనూ ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి.తాజాగా.. ఆమె 108 వాహనాన్ని కూడా నడిపిన సంగతి తెలిసిందే. ఆమె అంబులెన్స్ నడపడం అందరినీ ఆకట్టుకున్నప్పటికీ.. కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంపై మండిపడుతున్నారు.

ఇప్పుడు ఏకంగా ఆమె గన్ మ్యాన్ కి సైతం కరోనా సోకిందన్న వార్త బయటికి రావడంతో సోషల్ మీడియాలో ఆమెపై విసుర్లు విసురుతున్నారు నెటిజన్లు.